బొంబాయి, రోజా వంటి సినిమాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న హీరో అరవిందస్వామి.. అరవిందస్వామి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుతెచ్చుకున్ననాడు. ఇక రజనీకాంత్తో కలిసి అరవిందస్వామి నటించిన చిత్రం దళపతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఈ సినిమా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా తరువాత హీరోగా మారి ఎన్నో అవకాశాలను అందుకోనీ బిజీ హీరోగా మారిపోయాడు అరవింద స్వామి. అయితే కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
ఇక ఆ తరువాత చేసేదేమీ లేక తన వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం పలువురు సీనియర్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా ద్వారా మొదటిసారిగా రీ ఎంట్రీ ఇచ్చాడు అరవింద స్వామి. ఈ చిత్రంతో కూడా అటు విలన్ గా ప్రేక్షకులను బాగా అలరించారు ఇదంతా ఇలా ఉండగా అరవిందస్వామి సినిమా లైఫ్, రియల్ లైఫ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటోంది. అరవిందస్వామి అపర్ణ ముఖర్జీ ని వివాహం చేసుకున్నారు. ఈమెకు సినీ ఇండస్ట్రీ కి ఎలాంటి సంబంధం లేదు.. అయినా కూడా ఈమ్మాయిని వివాహం చేసుకున్నాడు అరవింద్ స్వామి.
కానీ ప్రస్తుతం ఇమె మన దేశంలోనే ఫేమస్ అయిన న్యాయవాదులలో ఈమె కూడా ఒకరు. దేశంలో బడా పారిశ్రామికవేత్తల కేసులను ఈమె ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇతర దేశాలలోని కేసులను కూడా వాదించే లైసెన్స్ కూడా ఈ మీ దగ్గర ఉన్నట్లు సమాచారం. ఈమె ఒక వైపు న్యాయవాది గానే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా మంచి సక్సెస్ను అందుకుంది. అరవిందస్వామి కి చెందిన పలు కంపెనీలకు డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తుంది. ఇక వీరిద్దరూ కలిసి ప్రతి నెలా దాదాపుగా రూ. 37 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లుగా సమాచారం.