చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్ తన అమ్ముల పొదిలో అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే రఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు తీసుకొచ్చారు. ఇక తాజాగా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఈ రెండు నెలల్లో భారత్ పరీక్షించిన మిస్సైల్స్ సంఖ్య 11కు చేరుకుంది. వాటి వివరాలపై ఒక లుక్కేద్దాం..!
సెప్టెంబర్ 7 – ఒడిశా తీర ప్రాంతంలో హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్ వెహికిల్ (హెచ్ఎస్టీడీవీ) ను పరీక్షించారు. ఇది బ్రహ్మోస్ లాంటి క్రూయిజ్ మిస్సైల్స్‌కు శక్తినిస్తుంది. లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌కు ఉపయోగపడుతుంది.
సెప్టెంబర్ 22 – ఒడిశా తీరంలోనే హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్ఈఏటీ)ని పరీక్షించారు. ఇది మిస్సైల్స్ సిస్టమ్స్‌ను అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది.
సెప్టెంబర్ 23 – మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో డీఆర్‌డీవో రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను పరీక్షించారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ కలిగిన వాహనాలను నాశనం చేయగలదు.
సెప్టెంబర్ 23 – ఒడిశాలోని బాలాసోర్‌లో డీఆర్డీవో రూపొందించిన పృథ్వి-2 మిస్సైల్‌ను పరీక్షించారు.
సెప్టెంబర్ 30 – ఒడిశాలోని ల్యాండ్ బేస్డ్ ఫెసిలిటీలో అత్యంత సుదీర్ఘ దూరం ప్రయాణించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించారు.
అక్టోబర్ 1 – మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న ఎంబీటీ అర్జున్ ట్యాంక్‌లో లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు.
అక్టోబర్ 3 – ఒడిశా తీరంలో అణు సామర్థ్యం కలిగిన శౌర్య మిస్సైల్ కొత్త మోడల్‌ను విజయవంతంగా పరీక్షించారు.
అక్టోబర్ 5 – సబ్‌మెరైన్లలో ఉండే టోర్పిడోలు మరింత దూరం ప్రయాణించేందుకు గాను నూతనంగా యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ స్మార్ట్ టోర్పిడో సిస్టమ్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు.
అక్టోబర్ 10 – భూమిపై ఉండే శత్రు దేశాలకు చెందిన రాడార్లను పసిగట్టేందుకు గాను రూపొందించిన రుద్రమ్-1 అనే యాంటీ రేడియేషన్ మిస్సైల్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు.
అక్టోబర్ 18 – ఐఎన్ఎస్ చెన్నై వద్ద బ్రహ్మోస్ క్షిపణికి చెందిన నేవీ మోడల్‌ను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు.