అక్కినేని అఖిల్ హిట్ కోసం చేస్తున్న చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. ఇప్పటికి హీరోగా మూడు చిత్రాల్లో నటించినా అఖిల్ ఏమాత్రం ప్రభావం చూఊపించలేకపోయాడు. దీంతో నాలుగ వ సినిమాతో అయినా తన మార్కుని చూపించాలని, హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందు కోసం కొత్త తరహా కథని ఎంచుకుని `బొమ్మరిల్లు` భాస్కర్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ప్రీ లుక్ టీజర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అఖిల్ ఈ టీజర్లో ఫార్మల్ డ్రెస్‌లో కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే కొంత బొద్దుగా కనిపిస్తున్నాడు. `హాయ్ ఐయామ్ హర్షా.. ఒక అబ్బాయి జీవితంలో 50 పర్సెంట్ కెరీర్.. 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. అయితే కెరీర్‌ని సూపర్‌గా సెట్ చేశాను. ఈ మ్యారీడ్ లైఫే అయ్యయ్యో` అంటూ టీజర్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
కెరీర్ ఓకే కానీ మ్యారీడ్ లైఫ్ నాట్ ఓకే అన్నట్టుగా పెళ్లి కోసం స్ట్రగుల్ అయ్యే యువకుడిగా అఖిల్ ఈ మూవీలో కనిపించనున్నట్టు తెలిస్తోంది. పెళ్లి లైఫ్ కోసం తిప్పలు పడే హీరోగా అఖిల్ పాత్రని బొమ్మరిల్లు భాస్కర్ కొంచెం కొత్తగా డిజైన్ చేసినట్టు అర్థమవుతోంది. ప్రీ లుక్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. టీజర్‌ని ఈ నెల 25న ఉదయం 11:40 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. టీజర్లో కూడా సోలోగానే అఖిల్ అదరగొడతాడో లేక పూజా హెగ్డేకి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.