వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ దళితులపై దాడులు పెరిగిపోయాయని గగ్గోలుపెడుతున్న చంద్రబాబుకు దళితులంటే ఎంతప్రేమో మరోసారి నిరూపించుకున్నారు! ట్విట్టర్ వేదికగా దళిత స్వరం వినిపిస్తోన్న చినబాబుకి కూడా ఎంతిష్టమో తెలుసా? అందుకు మరో ఉదాహరణగా నిలిచింది చిత్తురు జిల్లా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సందర్భం. ఇప్పటికైనా చంద్రబాబుకు దళితులపై ఎంత గౌరవమో, వారంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలి!
వివరాళ్లోకి వెళ్తే… దళితులుగా పుట్టాలని ఎవరైన కోరుకుంటార అని అధికారంలో ఉన్నప్పుడు కళ్లుమూసుకుపోయిన మాట్లాడిన చంద్రబాబు… 2019 ఎన్నికల ఫలితలతో కళ్లకున్న పొరలు తొలగిపోయాయి అన్నట్లుగా దళితులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్న సంగతి తెలిసిందే! దళుతులంటే జగన్ కు ఇష్టం లేదన్న కామెంట్లు కూడా బాబు & కో చేసేస్తున్నారు! ఈ క్రమంలో… తాజాగా చంద్రబాబు సొంత జిల్లాలో తాజాగా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులను నియమించిన సందర్భంగా దళితులకు మొండిచేయి చూపించారు!
బాబు సొంత జిల్లాలో సుమారు 45 లక్షల జనాభా ఉంటే.. వారిలో 25 లక్షలకుపైగా ఎస్సీలు ఉన్నారు! ఆ జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండింటిని, 14 అసెంబ్లీ స్థానాల్లో మూడింటిని ఎస్సీలకు రిజర్వు చేశారు. అయితే తాజాగా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు… ఏ ఒక్క స్థానానికి ఎస్సీలను కేటాయించలేదు!
ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన నాయకులను కూడా సంప్రదించలేదంట చంద్రబాబు! చంద్రబాబుకు ఎస్సీలపై ఉన్న ప్రేమకు, గౌరవానికి ఇది ఒక తాజా ఉదాహరణ అని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్! మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉన్నా బాబుకు అస్సలు పడదనేది వారి మరో కామెంట్!!
-CH Raja