క‌రోనాతో ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చేరితే.. ఖర్చు ఎంత‌వుతుందంటే..?

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం గాంధీ ఆస్ప‌త్రిలోనే క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌లిగించేందుకు గాను ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లోనూ కరోనా చికిత్స అందించేందుకు అనుమ‌తులు జారీ చేసింది. అలాగే ఆయా హాస్పిట‌ళ్ల‌లో క‌రోనా టెస్టులు, చికిత్స‌కు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. అయితే క‌రోనా వ‌చ్చిన ఒక వ్య‌క్తి కోలుకునేందుకు దాదాపుగా 15 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతున్న నేప‌థ్యంలో అన్ని రోజుల పాటు ప్రైవేటు హాస్పిట‌ల్‌లో ఉంటే చికిత్స‌కు ఎంత మొత్తంలో ఖ‌ర్చ‌య్యే అవ‌కాశం ఉంటుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

do you know how much charge it will for 15 days of corona treatment in private hospital for one person

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రైవేటు ఆస్ప‌త్రులు, ల్యాబ్‌ల‌లో క‌రోనా టెస్టులు, చికిత్స‌కు నిర్దారించిన ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

* క‌రోనా టెస్టుకు రూ.2200
* జ‌న‌ర‌ల్ వార్డులో క‌రోనా చికిత్స ఇస్తే రోజుకు రూ.4500
* ఐసీయూలో వెంటిలేట‌ర్ లేకుండా చికిత్స ఇస్తే రోజుకు రూ.7500
* ఐసీయూలో వెంటిలేట‌ర్ ద్వారా చికిత్స ఇస్తే రోజుకు రూ.9వేలు

ఇక చికిత్స‌లో భాగంగా యాంటీ బ‌యోటిక్‌ల‌ను వాడితే అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చిన ఒక వ్య‌క్తి ప్రైవేటు హాస్పిట‌ల్‌లో 15 రోజుల పాటు చికిత్స పొందితే.. అయ్యే మొత్తం ఖ‌ర్చు.. ఉజ్జాయింపుగా ఇలా ఉండ‌నుంది.

జ‌న‌ర‌ల్ వార్డుకు అయితే..
మొద‌ట క‌రోనా టెస్టు – రూ.2200
15 రోజుల పాటు రోజుకు రూ.4500 చొప్పున మొత్తం – రూ.67,500
చివ‌ర్లో 2 సార్లు క‌రోనా టెస్టులు (ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం) – రూ.4400

–> మొత్తం అయ్యే ఖ‌ర్చు – రూ.74,100

ఐసీయూలో వెంటిలేట‌ర్ లేకుండా…
మొద‌ట క‌రోనా టెస్టు – రూ.2200
15 రోజుల పాటు రోజుకు రూ.7500 చొప్పున మొత్తం – రూ.1,12,500
చివ‌ర్లో 2 సార్లు క‌రోనా టెస్టులు (ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం) – రూ.4400

–> మొత్తం అయ్యే ఖ‌ర్చు – రూ.1,19,100

ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై…
మొద‌ట క‌రోనా టెస్టు – రూ.2200
15 రోజుల పాటు రోజుకు రూ.9వేల‌ చొప్పున మొత్తం – రూ.1.35 ల‌క్ష‌లు
చివ‌ర్లో 2 సార్లు క‌రోనా టెస్టులు (ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం) – రూ.4400

–> మొత్తం అయ్యే ఖ‌ర్చు – రూ.రూ.1,41,600

ఇక ఇవి కాకుండా యాంటీ బ‌యోటిక్‌ల‌ను ఎక్కువగా వాడితే అద‌నంగా చార్జి చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news