ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)టీ20 క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 18 నుంచి ఈ సారి టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 10వ తేదీన ముగియనుంది. మొత్తం 33 మ్యాచ్‌లు ఆడుతారు. కరోనా కారణంగా టోర్నీ పూర్తిగా బయో సెక్యూర్ బబుల్‌లో జరుగుతుంది. అలాగే కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే ఈ సారి మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఇక ఈ టోర్నీలో విజేతలకు, ఇతరులకు అందించనున్న ప్రైజ్ మనీల వివరాలు ఇలా ఉన్నాయి.
సీపీఎల్ టీ20 టోర్నీలో గెలిచిన వారికి 1 మిలియన్ డాలర్లు ఇస్తారు. అదే రన్నర్-అప్స్‌కు అయితే 6.60 లక్షల డాలర్లను బహుమతిగా ఇస్తారు. 3వ స్థానంలో నిలిచిన వారికి 2.50 లక్షల డాలర్లను, 4వ స్థానంలో నిలిచిన వారికి 1 లక్ష డాలర్లను ఇస్తారు. ప్లేయర్లకు ప్రైజ్ మనీని 1.50 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. లాంగెస్ట్ సిక్స్ కొట్టిన వారికి 5వేల డాలర్లు ఇస్తారు. మొత్తం అన్ని ప్రైజ్ మనీలు కలిపి 2.16 మిలియన్ డాలర్లు అవుతుంది.
కాగా ఐపీఎల్‌లో 2019లో కేవలం విజేతగా నిలిచిన జట్టుకే 2.8 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. అయితే ఈ సారి ప్రైజ్ మనీ ఎంత అన్న వివరాలు ఇంకా తెలియలేదు. కాగా గత ఐపీఎల్‌లో మొత్తం ప్లేయర్లకు అందిన ప్రైజ్ మనీ 7 మిలియన్ డాలర్లు.