పీఎన్‌బీ కొత్త స్కీమ్ అర్హత కలిగిన వారికి భారీ రుణం..!

-

దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసందే. దీంతో చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జీవనం సాగించడానికి కష్టతరంగా మారింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలవడానికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా బ్యాంకులు కూడా కొత్త కొత్త స్కీమ్ లు ప్రవేశపెట్టింది.

currency
currency

తాజాగా పీఎన్‌బీ కొత్త స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చిందని బ్యాంకు యాజమాన్యం తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక కష్టాలు పడుతున్నారా? ఆదాయం తగ్గిపోయిందా? అయితే మీకోసం ఒక బ్యాంక్ ప్రత్యేకమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సులభంగానే రుణం పొందొచ్చునని వారు తెలియజేశారు.

అయితే దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి పీఎన్‌బీ వీవర్ ముద్రా పథకం (PNBWMS) అని నామకరణం చేశారు. ఈ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన వారు రూ.2 లక్షల వరకు రుణం పొందొచ్చునని యాజమాన్యం తెలిపారు. ఈ పథకాన్ని నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా పీఎన్‌బీ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలియజేశారు.

అంతేకాకుండా పీఎన్‌బీ కొత్త స్కీమ్ ద్వారా మగం వేసే వారు రుణాలు పొందొచ్చునని సిబ్బంది తెలిపారు. ముద్రా స్కీ్మ్ లోని శిశు, కిశోర్ విభాగాల కింద లోన్ తీసుకోవచ్చునన్నారు. రుణ మొత్తాన్ని మూలధన అవసరాల కోసం వెచ్చించొచ్చునని తెలిపారు. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం లభిస్తుందన్నారు. టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖతో చర్చించిన తర్వాతనే పీఎన్‌బీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. మగ్గం నేసే వారి కోసం కొత్త రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో మగ్గం నేసే వారు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంక్ యాజమాన్యం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news