‘ఆర్ఆర్ఆర్’లో తారక్ బైక్ కోసం అంత ఖర్చయిందా..!

-

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సినీ ప్రేక్షకులు, మెగా, నందమూరి అభిమానులు టాకీసుల వద్ద చిత్ర కటౌట్‌లు, హీరో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ ‘ఆర్ఆర్ఆర్’ మేనియా కొనసాగుతోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ‘ఆర్ఆర్ఆర్ మూవీ, ఆర్ఆర్ఆర్ రివ్యూ’ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో రాజమౌళి సినిమా కోసం ఉపయోగించిన సాంకేతికత, వస్తువులు, ఇతర సామగ్రి గురించి చర్చ జరుగుతున్నది.

tarak bike rrr
tarak bike rrr

సినిమా షూటింగ్ సందర్భంగా రాజమౌళి అప్పట్లో విడుదల చేసిన వీడియోలో రామ్ చరణ్ గుర్రం రైడ్ చేస్తుండగా, తారక్ బైక్ పైన వెళ్తుండటం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, ఆ బైక్ కోసం ఎంత ఖర్చయింది? దాని కోసం స్పెషల్‌గా ఎటువంటి డిజైన్ చేశారు? అనే అంశాలపైన ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ బైక్ సీన్ మూవీలో హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే సినిమా బెన్ ఫిట్ షో చూసిన వారు తారక్ వాడిన బైక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్తున్నారు.

సినిమాలో కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించిన బైక్ ఆంగ్లేయుల కాలం నాటిది. కాగా, ఆనాటి బ్రిటీషు వారు ఉపయోగించే బైక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని, అటువంటి బైక్ ను జక్కన్న తయారు చేయించాడు. నిజానికి అటువంటి బైక్ ఒరిజినల్ ది దొరుకుతుందా? అని ఆయన ట్రై చేశాడట. కానీ, అది దొరకకపోవడంతో ఆనాటి కాలంలో బైక్ మోడల్ ఎలా ఉండేదో, అదే మాదిరిగా స్పెషల్‌గా జక్కన్న డిజైన్ చేయించాడు. ఇందుకుగాను స్పెషల్ కేర్ తీసుకున్నాడు. రాజమౌళి ఈ బైక్ డిజైన్ కోసం ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు చేయించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బైక్‌లో రైడ్ చేస్తున్నట్లు కనిపిస్తుండగా, ఇక రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేస్తుండటం మనం ట్రైలర్‌లో చూడొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news