భార‌త్‌లో నేడు కొత్త‌గా 1,685 క‌రోనా కేసులు.. 83 మ‌ర‌ణాలు

-

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రోజు రోజు క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తున్నాయి. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 1,685 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ గురువారం దేశంలో 1938 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు 253 కేసులు త‌గ్గాయి.

కాగ ప్ర‌స్తుతం ఇండియాలో 0.24 పాజిటివిటీ రేటు ఉంది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2499 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య.. 4,24,78,087 కు చేరుకుంది. అలాగే భార‌త్ లో ప్ర‌స్తుతం 21,530 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 83 మంది క‌రోనా వైర‌స్ బారీన ప‌డి మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా మ‌ర‌ణాల సంఖ్య 5,16,755 కు చేరుకుంది. కాగ ఈ రోజు దేశ వ్యాప్తంగా 29,82,451 క‌రోనా డోసుల‌ను పంపిణీ చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 1,82,55,75,126 డోసుల‌ను పంపిణీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news