వ్యవసాయం అందరూ చేస్తారు.. కానీ కొన్ని మెలుకువలు తెలుసుకొని చెయ్యడం మంచిది.. అప్పుడే అధిక దిగుబడిలను పొందవచ్చు..ఫర్టిగేషన్ విధానం ద్వారా మంచి లాభలను పొందవచ్చు.. మొక్కలకు అవసరమైన సాగునీరు,సూక్ష్మ, స్థూల పోషక ఎరువులు అన్ని మొక్కలకు సమానంగా ఒకేసారి అందించటం వీలవుతుంది..అయితే మొక్కలు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని అధిక నాణ్యమైన దిగుబడులు సాధించడమే కాకుండా పర్యావరణంపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.
కూలీల కొరత అధికంగా ఉన్న రోజుల్లో తక్కువ శ్రమతో మొక్కలకు నీటిని, నీటిలో కరిగే ఎరువులను అందించే వెసులుబాటు ఉండడంతో చాలామంది రైతులు బిందు సేద్యం లో ఫర్టిగేషన్ విధానాన్ని అనుసరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫర్టిగేషన్ పద్ధతి వల్ల పంట దిగుబడులు దాదాపు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..
మొక్కలకు అవసరమైన పోషకాలు ఖచ్చితత్వంతో మొక్క వేరు వ్యవస్థకు నేరుగా అందించడం వల్ల ఎరువుల వృధాను అరికట్టే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. అలాగే కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. ఎరువులను వెదజల్లడం , మొక్కల మొదళ్ళలో వేయడం వంటి సాంప్రదాయ పద్ధతిలో ఎరువుల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానం కొంత శ్రమతో కూడుకున్నదిగా చెప్పవచ్చు. ఫర్టిగేషన్ పద్దతిలో తక్కువ మోతాదులో ఎరువుల వినియోగం ఉండటంతోపాటు ఎరువును ఆదా చెయ్యొచ్చు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభలను పొందవచ్చు..