రీ ఎంట్రీ తో విజయశాంతి తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది విజయశాంతి. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా హీరోలకు దీటుగా కూడా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉండేది. అయితే విజయశాంతి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే రాజకీయాలలోకి అడుగు వేసి సినిమాలలో నటించడం మానివేసింది. అయితే మహేష్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రియంట్రి ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈమె ఎలాంటి సినిమాలు కూడా నటించలేదు.

విజయశాంతి రియంట్రీ ఇచ్చిన విజయశాంతి మంచి విజయాన్ని అందుకుంది. ఇక విజయశాంతి కం బ్యాక్ ఇచ్చిన కారణంగా రెమ్యూనరేషన్ విషయంలో కూడ అషామాసి గా తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి హీరోయిన్ కాబట్టి, అంతేకాకుండా పైగా ఆమెకు పెద్దగా సినిమాలు లేవు..రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు.అయితే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఇండస్ట్రీలో తెలిపిన సమాచారం ప్రకారం కోటి రూపాయల వరకు ఈమె రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక గతంలో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించింది. విజయశాంతి కెరియర్లు కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, ప్రతిధ్వని తదితర సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం తనకు కథ నచ్చి పాత్ర నచ్చితే కచ్చితంగా చేస్తానని తెలియజేస్తోంది. ఇక విజయశాంతి నటించాలంటే తన పాత్ర ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యతగా ఉండాలని విషయాన్ని మాత్రం దర్శక నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంతటి రెమ్యూనికేషన్ అందుకుంటూ తన హవా కొనసాగిస్తుంది విజయశాంతి. అందుకే ఈమె లేడీ సూపర్ స్టార్ గా పిలుస్తారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news