గూగుల్ పే ద్వారా పిఎం కేర్ కి ఎంత వెళ్ళాయో తెలుసా…?

-

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది తమ తమ దేశాల ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా పిఎం కేర్ ఫండ్స్ భారీగానే వచ్చాయి. ఇక వీటిని గూగుల్ పే రూపంలో చాలా మంది చేసారట. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ప్రకటించింది.

ఈ మేరకు ఇండియా హెడ్ సంజయ్ గుప్తా ఒక ప్రకటన చేసారు. దాదాపు 20 లక్షల లావాదేవీల జరిగాయని వాటి ద్వారా పీఎమ్ కేర్స్‌కు వచ్చాయని పేర్కొన్నారు. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో పేర్కొన్నారు. ఈ యాప్ కి దేశంలో మంచి స్పందన ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news