మెంతికూర తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా..?

-

మెంతికూర మానవుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చటి ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పెరటిలో పెంచడం చాలా సులువైన పని. విత్తనాలు చల్లిన కొద్ది రోజుల లో మొక్కలు వస్తాయి.ఇందులో ఐరన్,కాల్షియం, టైప్ 1, టైప్ 2,విటమిన్ సి , మాంగనీస్, సెలీనియం ఉన్నాయి.మెంతి ఆకులలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. మెంతి కూర వలన మగ వారి కన్నా స్త్రీల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

మెంతికూరలో అతి ఎక్కువ విలువైన పోషకాలు ఉంటాయి. మనం మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తుంటాం.అలానే మెంతికూరను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్థాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి.ఆడవారిలో ఎక్కువగా కనిపించే నడుము నొప్పి, కడుపునొప్పని తగ్గించడంలో ఎంత గానో సహాయపడుతుంది.బాలింతలకు మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ మెంతి కూర తినడం వలన తల్లి పాలు తాగే పిల్లలు ఆరోగ్యాంగా పెరుగుతారు.

మెంతులలో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటాయి .మెంతి ఆకును చాలా మెత్తగా నూరి జుట్టుకి పట్టించడం వలన వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉంటాయి. అలానే జుట్టు ఒత్తుగా పెరగడంలో ఉపయోగపడుతుంది.మెంతికూరల్లో అత్యధిక ఐరన్ ఉంటుంది. అందుకనే మెంతికూరను లేదా మెంతులను రక్తహీనత ఉన్న రోగులకు ఔషధపరంగా వాడుతారు.మెంతికూరలో విటమిన్ కి అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పీచుపదార్థాలు కూడా ఇందులో ఉంటాయి. కనుక మలబద్ధకం కలవారు మెంతికూర లేదా రసం తీసుకుంటే సమస్య తొలగిపోతుంది.

పచ్చి మెంతి ఆకులులో టైప్ 1, టైప్ 2 విటమిన్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు తాజా మెంతికూర ఆకును జ్యూస్ గా తయారుచేసి ప్రతిరోజు ఉదయం వేళ త్రాగితే షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.మెంతి ఆకులు అధిక రక్తపోటులో కూడా మేలు చేస్తాయి. గెలక్టోమన్నన్,పొటాషియం ఉండడం వలన రక్తప్రసరణను నియంత్రిస్తుంది.మెంతి ఆకులు బరువు తగ్గిస్తాయి. అలాగే అజీర్ణం, మలబద్ధకం కడుపులో అల్సర్,పేగు మంట సమస్యను తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news