నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ కాస్ట్యూమ్స్ ఖర్చు ఎంతో తెలుసా ?

-

మెగా నట వారసురాలు నిహారిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. పెళ్లికి ఎవరెవరు వస్త్తారని కొందరు ఎదురుచూడగా.. మరికొందరి చూపు మాత్రం.. మెగా.. అల్లు జంటలు ఏయే డిజైనర్‌వేర్‌తో వచ్చారు? ఎవరు ఎంత కాస్ట్‌లీ వేర్‌తో ఆకట్టుకున్నారని చూశారు. వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌కు ధర కూడా నిర్ణయించేశారు. మరి పెళ్లిలో ఎవరు ఎక్కువ కాస్ట్యూమ్స్ మార్చారు? ఎవరు కాస్టీ వేర్‌తో మెరిశారో లెక్కలు తీశారు…

పసుపు కొట్టడంతో నిహారిక పెళ్లి తంతు మొదలైంది. ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లికి అల్లు, మెగా ఫ్యామిలీస్‌ స్పెషల్‌ ఫ్లైట్స్‌లో వెళ్లడం.. అక్కడ సంగీత్‌, మెహందీ.. హల్దీ అంటూ ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌ ఘనంగా జరిగింది. చిరంజీవి… నాగబాబు దంపతులను పక్కన పెడితే.. హడావుడి అంతా యంగ్‌ కపుల్స్‌దే. రామ్‌చరణ్‌-ఉపాసన.. బన్నీ-స్నేహారెడ్డి .. చిరంజీవి కూతుళ్లు ధరించిన డిజైనరీ దుస్తులు.. బ్యాగ్‌లు.. జ్యువెల్‌ ఫ్యాషన్‌ ప్రియుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఎవరి బట్టలు ఎవరు డిజైన్‌ చేశారు.. బ్యాగ్‌లు ఏం కంపెనీవి.. వాటి రేటెంతో పోస్ట్‌ చేశారు. వీటిని నెటిజన్లు కట్టిన వెల షాక్‌ ఇచ్చేలా వున్నాయి.

బన్నీ దంపతులు నీహారిక పెళ్లికి బయలుదేరడం మొదలు.. తిరిగి వచ్చేవరకు.. నెట్‌లో ఫొటోలు పోస్ట్‌ చేస్తూనే వున్నారు. ప్రతి ఈవెంట్‌లోనూ డ్రస్‌ సెన్స్‌ తో అందరి దృష్టి తమవైపు తిప్పుకున్నారు. ఉదయ్‌పూర్‌ వెళ్లేటప్పుడు స్నేహారెడ్డి ధరించిన బూడిద రంగు వెస్ట్రన్‌ లాంగ్‌ ఫ్రాంక్‌ బన్నీకి బాగా నచ్చింది. సో క్యూటీ అంటూ కామెంట్ చేశారు. అనితా దొంగ్రే డిజైన్‌ చేసిన ఈ ఫ్రాక్‌ దర 13 వేలే అయినా.. అదే సమయంలో చేతిలో వున్న దియోర్‌ శాడల్‌ కంపెనీ బ్యాగ్‌ ధర రెండున్నర లక్షలుంటుందని అంచనా. సంగీత్‌లో స్నేహారెడ్డి వాడిన డిజైనర్‌ వేర్‌ 4 లక్షలు పైమాటే.

పెళ్లికెళితే.. ఆడవాళ్ళ చూపులన్నీ.. నగలు బట్టలపైనే వుంటాయి. అందులోనూ మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి. స్టార్స్‌ కపుల్‌ ఎలా కనిపిస్తారన్న ఆసక్తిని రెట్టింపు చేశారు. ఉదయ్‌పూర్‌ వెళ్లేటప్పుడు ఉపాసన లైట్‌ పింక్‌ కలర్‌ ఫ్రాక్‌లో మెరిసింది. ఆమె చేతిలో వున్న బ్యాగ్‌ ఖరీదు చూస్తే.. కళ్లు తిరగడం ఖాయం. హెర్మస్‌ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్‌ ఖరీదు దాదాపు 12 లక్షలని నెటిజన్లు ఎస్టిమేషన్‌ వేశారు. ఇక సంగీత్‌లో.. పెళ్లిలో తరుణ్‌ తహిలియానీ.. మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన దుస్తులు లక్షల్లో వుంటాయి.

సినిమా జానర్స్‌లో తేడాలున్నట్టు.. మెగా..అల్లు జంటలు ధరించిన డిజైనర్ వేర్‌లో కూడా తేడాలున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో లుక్ తో కనిపించి ఆకట్టుకున్నారు. చరణ్‌ సింప్లిసిటీ డిజైన్స్‌ను ఎంచుకుంటే… బన్ని అయితే కాస్ట్‌లీ డ్రెస్‌లను డిజైన్‌ చేయించుకున్నాడు. నాలుగు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఒక్కొక్కరు సుమారు 12 జతలు మార్చేశారట.

ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు సంగీత్.. మెహెందీ.. హల్దీ.. పెళ్లి తర్వాత పార్టీ. ఇలా ప్రతిచోటా ఓ కొత్త డిజైనర్ లుక్ తో పెళ్లికొడుకు.. పెళ్లి కూతురుతో మెగా, అల్లు ఫ్యామిలీ కపుల్స్‌ పోటీపడ్డారు. సంగీత్‌లో ఇలా కనిపించారు కదా… మరి పెళ్లిలో ఎలాంటి డిజైన్‌ వేర్‌తో కనిపిస్తారన్న ఆసక్తిని ఫ్యాషన్‌ ప్రియుల్లో పెంచేశారు. ఇక నీహారిక జిమ్‌మేట్‌ లావణ్య త్రిపాఠి లక్షా పాతిక వేల చీర కట్టింది. నిశ్చయ్‌ సంగీత్‌లో లావణ్య ధరించిన నీలిరంగు చీర ను మనీష్‌ మల్హాత్రా డిజైన్‌ చేశాడు.

నీహారిక పెళ్లి సందడి పెళ్లి తర్వాత కూడా సాగింది. నిశ్చయ్‌ పెళ్లి తర్వాత రోజు ఉదయ్‌విలాస్‌లోనే చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత క్రీమ్‌ కలర్‌లో చీరలో చాలా సింపుల్‌గా కనిపించినప్పటికీ సభ్యసాచి బ్రాండ్‌కు చెందిన ఈ చీర ధర రూ.85 వేలట. ఈ లెక్కలను బట్టి చూస్తే ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. నిహారిక అందరికీ తెలిసిన అమ్మాయే. వరుడు చైతన్యను కూడా పెళ్లి ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి చూస్తూనే వున్నాం. దీంతో నిహారిక పెళ్లి కంటే.. అల్లు, మెగా జంటలు అపీరియన్స్‌ ఎలా వుంటుంది? ఎలా కనిపించారన్న దానిపైనే ఎక్కువ ఆసక్తి నడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news