యాంకర్ రవి మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?

-

ఫిమేల్ యాంకర్స్ లో సుమ ఎంతటి క్రేజ్ అయితే సంపాదించుకుందో మేల్ యాంకర్స్ లో రవి కూడా అంతే పాపులారిటీని దక్కించుకున్నాడు. 2010లో మా మ్యూజిక్ టీవీలో లవ్ జంక్షన్ ద్వారా యాంకర్ గా తన కెరీర్లు మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత వరుస షో లు చేస్తూ బిజీ అయిపోయాడు. అంతేకాదు బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు రవి. ఇకపోతే ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన మొదటి పారితోషకం గురించి వెల్లడించారు. తన మొదటి పారితోషకం 250 రూపాయలు అందుకున్నాను అని తెలిపారు. క్రికెటర్ అవ్వాలని కోరుకున్నప్పటికీ కాలేకపోయానని తెలిపాడు.

ఇకపోతే రవితోపాటు అతడి భార్య నిత్యా సక్సేన, కూతురు నియాతో కలిసి యూట్యూబ్లో సందడి చేసిన వీడియో లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఒక్కో ఎపిసోడ్ కి రూ. 250 చొప్పున నెలలో ఎన్ని ఎపిసోడ్స్ వస్తే అన్ని రూ. 250 వచ్చేవి అని యాంకర్ రవి గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తన భార్య నిత్య బీటెక్ థర్డ్ ఇయర్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ తెచ్చుకుందని .. అప్పట్లో నిత్యకు నెలకు రూ.22,500 జీతం వచ్చేది అని యాంకర్ చెప్పాడు. రవి అంటే చాలా ఇష్టం, తన భర్త తన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే చాలు అని కోరుకునే అమ్మాయి నిత్య. అయితే ఈ విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఎన్నో షో లకు యాంకరింగ్ చేస్తూ రవి కూడా చాలా బిజీగా మారిపోయాడు. యాంకర్ రవికి ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఒక్కో సోలో ఒక్కో ఎపిసోడ్ కి సుమారుగా రూ.4 లక్షల పారిపోషకం తీసుకునే రేంజ్ కు ఎదిగిపోయారు. ఏదేమైనా యాంకర్ రవి క్రేజ్ ఈ తరం వారు అందుకోలేరని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news