నేడు తెలంగాణా కేబినేట్ భేటీ.. ఇల్లు కట్టుకునే వారికి కేసీఆర్ శుభవార్త !

-

 

 

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి ధోరణి తో ముందుకు వెళ్లాలి అలాగే, ఎలాంటి నిర్ణయాలు ప్రకటించాలని దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇందులో భాగంగానే, ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. అలాగే ముందస్తు ఎన్నికలపై కూడా సీఎం కెసిఆర్ చర్చించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news