మందుల షీట్ వెనక ఈ రెడ్ లైన్‌కి అర్థమేంటో తెలుసా..?

-

జనరల్ గా..మందులు కొనేప్పుడు ఎక్సైరీ డేట్ చూడ్డం తప్ప మనం ఏం గమనించం. కొంతమంది అవికూడా చూడరు. ఇంటికొచ్చాక చూస్తారు. ఇంకా..చిన్నచిన్న సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా..మెడికల్ షాప్ కు వెళ్లి మన బాధ ఏంటో చెప్తే..వాళ్లు టాబ్ లెట్ ఇస్తారు. షాప్ వాడు ఏది ఇస్తే అది తీసుకొస్తాం. అయితే..మందులు షీట్ వెనుక రెడ్ లైన్ ఉంటే..అలాంటి మందులు మీరు షాప్ వాడు ఇచ్చాడు కదా అని గుడ్డిగా వాటిని వేసుకోకూడదు. ఆ లైన్ కి అర్థం ఏంటంటే..

ఈ రెడ్ లైన్‌కి కేంద్ర ఆరోగ్య శాఖ… 2016 ఏప్రిల్ 18న ఓ ట్వీట్ చేసింది. తిరిగి అలాంటిదే మరో ట్వీట్‌ని 2019 మే 13న కూడా చేసింది. ఈ రెండు ట్వీట్లలో మందులు, యాంటీబయోటిక్స్‌ షీట్ల వెనక రెడ్ స్ట్రిప్ ఎందుకు ఉంటుందో సవివరంగా వివరించింది. ఇలాంటి లైన్ ఉన్న మందుల్ని మనం డైరెక్టుగా కొనకూడదు. వీటిని మనం డైరెక్టుగా వాడొద్దు..డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌లో ఉంటేనే ఇలాంటివి కొనుక్కోవాలి. అది లేకుండా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మందుల షాపుల వాళ్లు కూడా… ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందుల్ని అమ్మకూడదని నిబంధన ఉంది.. ఈ జాగ్రత్తను పాటించమని కేంద్రం తెలిపింది.

కానీ వాళ్లు పట్టించరే..

కేంద్ర ప్రభుత్వం బాగానే అలర్ట్ చేసింది గానీ… సమస్యంతా ఫార్మసీ వాళ్ల దగ్గరే ఉంటుంది. వాళ్లు రూల్స్ పాటిస్తూ సరైన మందులు ఇస్తే ప్రజలకు ఏ ఇబ్బందీ ఉండదు. కానీ మన దేశంలో ఇలా పాటించే వాళ్లు చాలా తక్కువ..ఈ రెడ్ లైన్లను ఎంత మంది ఫార్మసిస్టులు పట్టించుకుంటున్నారనేది..పెద్ద ప్రశ్నే.

చాలా ఫార్మసీలలో స్టాఫ్ టెన్త్ పాసైన వారు, ఫార్మసీ బ్యాక్ గ్రౌండ్ లేని వారు సైతం మందులు అమ్మేస్తుంటారు. కఠిన నిబంధనలు తెచ్చేవరకూ..ఈ దందా సాగుతూనే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. మీరు అయితే..ఈసారి..మెడికల్ షాప్ కి వెళ్లినప్పుడు ఇచ్చే టాబ్ లెట్స్ షీట్ కు రెడ్ లైన్ ఉందో లేదో గమనించండి. .

 

Read more RELATED
Recommended to you

Latest news