దొంగలకు వెన్నులో వణుకుపుట్టిస్తున్న పోలీసు..ఎక్కడో తెలుసా?

-

ప్రపంచ వ్యాప్థంగా దొంగలు లేని ప్రాంతం అనేది లేదు..అయితే ఒక్కో దొంగ ఒక్కో విధంగా దొంగతనం చేస్తారు.అందులో కొన్ని పోలీసులకు దొరికితే, మరికొన్ని మాత్రం పోలీసులకు చుక్కలను చూపిస్తున్నాయి..ఇక పోలీసులు కూడా మా ముందు నీ కుప్పిగంతులా అని ఎత్తు పై ఎత్తులు వేస్తూ దొంగలను చాకచక్యంగా పట్టుకుంటున్నారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే కొంతమంది.. ఎటువంటి భయం లేకుండా దొంగతనం చేస్తారు. అయితే అదృష్టం అన్నిసార్లు దొంగలవైపే ఉండదు.

ఒకొక్కసారి.. దొంగలను దురదృష్టం వెంటాడి.. పోలీసులకు పట్టిస్తుంది కూడా.. అలాంటి ఓ దొంగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు..ఢిల్లీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాల లెక్క చేయకుండా కదులుతున్న బైక్‌పై నుండి దొంగను పట్టుకున్నాడు. ఓ చైన్ స్నాచర్ మహిళ గొలుసును లాక్కెళ్లినట్లు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఈ విషయం తెలిసిన వెంటనే కానిస్టేబుల్ సత్యేంద్ర దొంగ కోసం వెతకడం ప్రారంభించాడు. ఇంతలో ముఖం మీద రుమాలు కట్టుకుని ఉన్న ఓ బైక్ రైడర్ ను సత్యేంద్ర చూశాడు.

ఓ వ్యక్తి తన ముఖాన్ని రుమాలుతో కప్పుకున్నాడు.. తనకు ఎదురుగా ఉన్న పోలీసులను చూసి భయపడడం మొదలు పెట్టాడు. దీంతో కానిస్టేబుల్ సత్యేంద్రకి ఆ వ్యక్తిపై అనుమానం పెరగడంతో… వెంటనే ఆ బైక్ రైడర్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.కానీ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు.దాంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.ఆ ఒక చైన్ స్నాచర్..అతన్ని పట్టుకోవడానికి కానిస్టేబుల్ చేసిన సాహాసానికి నెటిజన్లు ఫిధా అవుతున్నారు.. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..కాస్త అటు,ఇటు అయితే మాత్రం అతడికి గాయాలు అయ్యేవి..మొత్తానికి పట్టుకుని రియల్ హీరో అయ్యాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version