నాల్గొవ రోజు నానబియ్యం బతుకమ్మ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

-

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలైన విషయం తెలిసిందే..ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది.దీన్ని 9 రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇది నవరాత్రికి ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు.బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి.

జొన్న పంట కూడా తల ఊపుతూ ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యమైన రంగు రంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వేడుకగా చేసుకుంటారు. ఈ 9 రోజులు ప్రతి గడపకు పండుగ కళ వస్తుంది. అక్కాచెల్లెలు అంతా ఒక దగ్గరకు చేరుకుని కలిసి, ఆడి, పాడుతారు.తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను వెనక్కి తీసుకుని, మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు.

మహిళలు ప్రత్యేక దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తారు. బతుకమ్మకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం గౌరీ దేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది. తరువాత ఆమె అలసటతో ‘అశ్వయుజ పాడ్యమి’ నాడు నిద్రపోయింది. ఆమెను లేపడానికి ఈ బతుకమ్మను చేస్తారు.మరొక కథ – బతుకమ్మ, చోళ రాజైన ధర్మాంగద ,సత్యవతి కుమార్తె. ధర్మాంగదుడు తన 100 మంది కుమారులను యుద్ధంలో కోల్పోయాడని చెబుతారు. తరువాత, దంపతులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు దీంతో వారికి ఆడబిడ్డ పుట్టింది.

రుషులందరూ వచ్చి ఆమెకు “బతుకమ్మ ,శాశ్వతంగా జీవించు” అని అమరత్వాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుంటారు. తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే, నాలుగోరోజు జరుపుకునే బతుకమ్మ నానెబియ్యం బతుకమ్మ. ఈరోజు గౌరమ్మను చేసి తంగేడు వివిధ పూలతో అలంకరించి, వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు..ఇది నాల్గొవ రోజు నానబియ్యం బతుకమ్మ ప్రత్యేకత..

Read more RELATED
Recommended to you

Latest news