రామ్ పోతినేని ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

-

టాలీవుడ్ లో హీరో రామ్ పోతినేని లవర్ బాయ్ గా పేరు పొందారు.. రామ్ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ మేనల్లుడు కావడంతో సినీ ఇండస్ట్రీలోకి చిన్న వయసులోనే ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. మొదట రామ్ దేవదాసు సినిమా ద్వారా 2006లో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు.

కందిరీగ, మస్కా, గణేష్, రెడీ తదితర చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. కానీ ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్న రామ్ కి 2019లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలో ఉండే మాస్ యాంగిల్ ని చూపించి కమ్ బ్యాక్ ఇచ్చారు.. ఆ తర్వాత వరుసగా మాస్ కథలనే ఎంచుకుంటూ నటిస్తూ ఉన్నారు .ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 20వ సినిమాలు నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం .ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. అయితే రామ్ ఒకవైపు సినిమాలతో మరొకవైపు బిజినెస్ పరంగా ఇతర హీరోలకు పోటీగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు తాజాగా హీరో రామ్ ఆస్తి విలువ ఎంత ఉందో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్న తరుణంలో.. అందుతున్న సమాచారం ప్రకారం హీరో రామ్ ఒకో చిత్రానికి రూ .18 కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాదులో ఇల్లు, స్థలాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. అలాగే రామ్ కార్ల విలువ రూ .8 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. రామ్ దగ్గర ఖరీదైన బైకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పొలాలు స్థలాలు వ్యాపారాలు అన్ని కలుపుకొని దాదాపుగా రూ .180 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news