తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు పొందాడు మోహన్ బాబు. తరచూ ఏదో ఒక వార్తల్లో ఈ మధ్యకాలంలో నిలుస్తూ ఉన్నాడు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన కూడా ఒక గొప్ప నటుడే అని చెప్పవచ్చు.. పెదరాయుడు చిత్రం తో పాటు మోహన్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి నట విశ్వరూపాన్ని చూపించారు మోహన్ బాబు.
అయితే మోహన్ బాబు కొన్నిసార్లు తను మాట్లాడిన మాటల వల్ల ట్రోల్స్ కు గురి అవుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా మోహన్ బాబు జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మోహన్ బాబు మొదటి భార్య పేరు విద్యాదేవి. వీరిరువురికీ పుట్టిన సంతానమే మంచు లక్ష్మి, మంచు విష్ణు మోహన్ బాబు , విద్యా దేవి తో ఎంతో అన్యోన్యంగా ఉండే వారు.. కాని కొన్నిసార్లు మోహన్ బాబు సినిమా లో బిజీగా ఉండడం వల్ల తను సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యి చిన్నచిన్న గొడవల వల్ల ఆమె క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడినట్లు గా సమాచారం.
ఆ తరువాత మోహన్ బాబు విద్యా దేవి సోదరిని రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమెకు పుట్టిన కుమారుడు మనోజ్. ఇక మోహన్ బాబు తన విద్యా సంస్థలకు మొదటి భార్య పేరునే నామకరణం గా పెట్టారు. ప్రస్తుతం నిర్మాతగా పలు విద్యా సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తూ.. నటుడిగా తన కెరీర్ని కొనసాగిస్తూ ఉన్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఈయన పేరును దర్శక నిర్మాత దాసరి నారాయణరావు స్క్రీన్ నేమ్ లో మోహన్ బాబు అని నామకరణం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన పేరు మోహన్ బాబు గానే పాపులర్ అయింది.