ఓడియమ్మ..! తెలంగాణలో ఎండదెబ్బకు మద్యం ప్రియులు ఈ రెంజ్ లో బీర్ తాగారా..!

-

ఎండాకాలంలో..ఎప్పుడూ ఏదైనా కూల్ గా ఉండేది తాగితే బాగుండూ అనిపిస్తుంది.. మనలాంటోళ్లు అయితే.. ఏ మజ్జిగో, కొబ్బరినీళ్లో, శీతలపానియాలతోనే సరిపెట్టుకుంటాం.. కానీ మందుబాబులకు ఇవన్నీ ఆనవు కదా.. చిల్డ్ బీర్ తాగితే కానీ.. ఎండదెబ్బకు వాళ్లకు హాయిగా అనిపిస్తుంది. సమ్మర్ లో.. నైట్ టైంలో.. టెర్రస్ పైన కుర్చోని చిల్డ్ బారు తాగుతూ..ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది మజా.. ఆహా.. నెక్ట్స్ లెవల్ అంతే.. ఇలా అనుకునే.. లిక్కర్ సైతం పక్కకు నెట్టేసి.. బీర్లపై పడ్డారు మద్యం ప్రియులు..తెలంగాణలో ఈ ఏడాది బీర్ల అమ్మకాలు మాములుగా పెరగలేదు.. ఎంతో మీరే చూడండి..!

తెలంగాణలో జరిగిన బీర్ల అమ్మకాల లెక్కలు..

మార్చి నుంచి మే 14 వరకు అంటే 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన బీర్లు తాగారు. అంటే.. 10.64 కోట్ల లీటర్ల బీర్లు తాగారన్నట్లు.. 6.44 కోట్ల లీటర్ల లిక్కర్​ను మద్యం ప్రియులు లాగించేశారు. ఈ రెండింటినీ పోల్చుకుంటే.. సుమారు 4 కోట్ల లీటర్ల బీరు ఎక్కువగా ఏసేశారు.
ఈ ధరలను చూసుకుంటే.. గతేడాది, అంతకుముందు ఏడాది కంటే అధికం. విపరీతంగా బీర్ల అమ్మకాలు పెరిగాయట. 75 రోజుల్లో రూ.6,702 కోట్ల బీర్లు తాగేశారంటే ఒక్కసారి ఆలోచించండి.. ఏ రెంజ్ లో మనోళ్లు బీర్ తాగుతున్నారో..
గత ఏడాది. కరోనా భయంతో చల్లనివి తాగడానికి కాస్త వెనకాడారు.. ఇప్పుడు ఆ భయం లేదు..దీంతో ఎండ ఈరోజు ఎక్కువగా ఉంది అనిపిస్తే.. చాలు.. బీర్లమీద పడ్డారు మద్యం ప్రియులు. పెళ్లిల్లు, పార్టీలు ఇలా అంతటా చల్లని బీర్లే గొంతులో పోస్తున్నారు. తాగే అలవాటు ఉన్నవాళ్లు సరదాగా కలిస్తే.. నాలుగు బీర్లు తెచ్చుకుని బిర్యాని ఆర్డర్ ఇచ్చేస్తే.. సెట్.. ఆ నైట్ హ్యాపీగా బీర్ తాగేసి.. బిర్యాని తింటారు. అంతకు మించి ఆనందం వాళ్లకు ఇంకే ఉంటుంది.

ఫస్ట్ ప్లేస్ లో రంగారెడ్డి..

సమ్మర్ స్టాట్ అయినప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో అధికంగా 2.38 కోట్ల లీటర్ల బీర్లు తాగారు.
తర్వాతి స్థానంలో వరంగల్ జిల్లా ఉంది. ఇక్కడ కోటి 15 లక్షల బీర్లు తాగారు.
ఖమ్మం జిల్లాలో మాత్రం లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి.
నల్గొండ జిల్లాలో కోటి 7 లక్షలు లీటర్లు, కరీంనగర్ జిల్లాలో కోటి 6 లక్షలు లీటర్లు, మెదక్ జిల్లాలో 92.44 లక్షలు బీర్లు తాగేశారు.
హైదరాబాద్ జిల్లాలో 87.49 లక్షల లీటర్లు, మహబూబ్​ నగర్ జిల్లాలో 81.22 లక్షల లీటర్లు, ఖమ్మం కేవలం 40.53 లక్షలు లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి.
అయితే.. చల్లగా ఉంటుంది అని మనోళ్లు ఈరేంజ్ లో బీర్లు తాగారు కానీ.. వాస్తవానికి సమ్మర్ లో బీర్ తాగితే.. బాడీ ఇంకా హీట్ అవుతుంది. తాగినంత సేపే బాగుంటుంది.. తాగాక లోపల వేడి.. పొట్ట అంతా బీర్.. వాటర్ తాగాలనిపించదు.. బాడీ డీ హైడ్రేట్ అవుతుంది.. డే టైంలో తాగితే.. ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటాయి.. నైట్ అయితే…కాస్త కూల్ గా ఉంటుంది కాబట్టి.. అంత ప్రాబ్లమ్ ఉండదు.. ఏది ఏమైనా.. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారా ఏంటి..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news