ఈ విషయం మీకు తెలుసా.. వాట్సాప్ లో తెలియకుండానే స్టేటస్ చూడొచ్చు..!

-

ప్రస్తుతం వాట్సాప్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి దగ్గర ప్రస్తుతం వాట్సాప్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు. అయితే ప్రతిరోజు వాట్సాప్ వినియోగించే వారికి కూడా వాట్సాప్ లో ఉన్న కొన్ని ఆప్షన్ల గురించి తెలియదు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అయితే వాట్సాప్ తీసుకొచ్చిన స్టేటస్ ఆప్షన్ ద్వారా ఏదైనా మనకు నచ్చిన అంశాన్ని స్టేటస్ గా పెట్టుకోవడం అంతేకాకుండా మన స్టేటస్ ఎవరు చూశారు అన్నది కూడా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది.

అయితే ఒక వ్యక్తి స్టేటస్ పెట్టినప్పుడు ఆ వ్యక్తికి తెలియకుండానే స్టేటస్ చూసేందుకు కూడా వాట్సాప్ లో ఆప్షన్ ఉంటుంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. సాధారణంగా వాట్సాప్ లో ఉండే బ్లూ టిక్స్ ఆప్షన్ని ఆఫ్ చేసుకున్నారు అంటే మీరు ఒక వ్యక్తి యొక్క స్టేటస్ చేసినప్పటికీ కూడా అవతలి వ్యక్తికి మాత్రం తెలియదు. ఇలా అవతలి వ్యక్తికి తెలియకుండానే అతని యొక్క వాట్సాప్ స్టేటస్ ని రహస్యంగా చూసేందుకు అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news