చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో బాగా ఎదుగుతున్న చిరు ను చూసి చాలామంది ఓర్వలేక ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విష ప్రయోగం కూడా చేశారు. అయితే అవన్నీ తట్టుకొని నేటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి తన హవాను కొనసాగిస్తూ ఉండడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఎదగడాన్ని ఓర్వలేక ఆయనపై విష ప్రయోగం చేసింది ఎవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇకపోతే 34 ఏళ్ల క్రితం ఈ విషయం జరిగిన మీడియా మాత్రం పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యమైన విషయమని చెప్పవచ్చు . ఇకపోతే రీసెంట్గా ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ వెల్లడించారు.

సుమారుగా 25 సంవత్సరాల క్రితం టాలీవుడ్ చిత్ర సీమలో నంబర్ వన్ హీరోగా రికార్డులు క్రియేట్ చేసి అగ్ర కథానాయకులుగా ఎదిగారు చిరంజీవి. ఇక అప్పటివరకు ఉన్న హీరోలను దాటి చిరంజీవి అగ్ర హీరోగా ఎదిగారు అంటే ఆయన కష్టం, క్రమశిక్షణ, కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తాపత్రయమే కారణమని మురళీమోహన్ వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలలో ఆయన చేసే డాన్సులు , ఫైట్స్ కి యూత్ బాగా కనెక్ట్ అవుతూ వచ్చారు. ఇక ఈ క్రమంలోని ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే ఎవరిని అవమానపరచకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకు పోతున్న నేపథ్యంలో చిరంజీవి మరణ మృదంగం సినిమా షూటింగ్ ను చెన్నైలో చిత్రీకరించారు. ఇక అభిమానులు వెయిట్ చేస్తున్నారని మేనేజర్ చెప్పడంతో వారిని కలుసుకొని అభివాదం చేయాలనుకున్నారు.

ఇక గేటు దగ్గరకు వెళ్లిన తర్వాత ఒక అభిమాని చిరంజీవి కాళ్లు పట్టుకొని సార్ ఈరోజు నా పుట్టినరోజు మీరు కేక్ కట్ చేయాల్సిందే అని అడగడంతో.. చిరంజీవి అక్కడికి వెళ్లారట. కేక్ కట్ చేసిన తర్వాత కేక్ తినాలని సదరు అభిమాని చిరంజీవిని బలవంతం చేస్తే.. వద్దని చెప్పినా వినలేదట. అయినా ఆ అభిమాని చిరంజీవి నోట్లో కుక్కేశాడు. కానీ తోసిలాటలో ఆ కేక్ కింద పడిపోయింది. అది రంగు రంగుల గా వుంది. ఇక చివరికి చిరంజీవి సెట్స్ కి వెళ్లి నోరు కడుక్కొని మేకప్ వేసుకునే సమయంలో గమనిస్తే ఆయన పెదాలు నీలి రంగులోకి ఉండడానికి చూసి చిరంజీవి ఆశ్చర్యపోయాడట. ఇక ఈ విషయాన్ని నిర్మాతలకు చెబితే వెంటనే డాక్టర్స్ దగ్గరకు వెళ్లారని.. విష పదార్థం వల్లే రంగు మారిందని వైద్యులు చెప్పారట. ఇక విషం నోట్లోకి వెళ్లకుండా టాబ్లెట్స్ కూడా తీసుకున్నారట చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news