హీరోల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్న ఈ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా.?

-

సాధారణంగా టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల పారితోషకాలు ఊహించని స్థాయిలో ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క హీరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్న నేపథ్యంలో సినిమాల బడ్జెట్ లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇలా సినిమాల బడ్జెట్ తో పాటు హీరోల రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రమే లాభాలు వస్తున్నాయి.

వీటికి తోడు ఇప్పుడు పాపులర్ కమెడియన్లు కూడా తమ పారితోషకాన్ని పెంచేశారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఒక స్టార్ కమెడియన్ రేంజ్ గురించి ఆయన పారితోషకం గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నది ఒక్క సంతానం మాత్రమే. చాలామంది కమెడియన్లు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ సంతానంకు గట్టి పోటీ ఇచ్చే విషయంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సంతానంకు భారీ డిమాండ్ పెరిగింది.

ఇకపోతే తాజాగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజిత్ నటిస్తున్న చిత్రం #AK62. ఈ సినిమాలో సంతానం కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనికిగాను ఏకంగా 8 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ మొత్తం తెలుగులో కొంతమంది మిడిల్ రేంజ్ హీరోల పారితోషకంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. హీరోల రేంజ్ లో స్టార్ కమెడియన్ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండడంతో సినీ వర్గాలు సైతం ఒక రకంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే 60 కాల్ షీట్స్ కోసం సంతానం ఈ మొత్తం డిమాండ్ చేశారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news