గానగంధర్వుడి గా తన గాత్రంతో.. భారత ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలసుబ్రమణ్యం ఇకలేరు అనే నిజాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యంగా కోలుకుంటారు అనుకొని ప్రార్థనలు చేస్తున్న అభిమానులందరికీ.. బాలు మరణవార్త విని గుండెలు పగిలిపోయాయి. ఇక బాలు మృతిపై ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక భారతీయ సినీ పరిశ్రమలో బాలు ప్రస్థానం ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నెల్లూరు జిల్లా కోనెటమ్మ పేట లో జన్మించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం… చిన్నప్పటినుంచే సంగీతంపై మక్కువతో వుండేవారట. బాలసుబ్రమణ్యం తండ్రి సాంబమూర్తి హరికథ భక్తి రస నాటకాలలో పాల్గొనడంతో ఆయనకు మరింత ఆసక్తి పెరిగింది. దీంతో ఐదేళ్ల వయస్సు నుంచే తండ్రి దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకుంటూ భక్తరామదాసు నాటకంలో పాల్గొన్నారట ఎస్పీ బాలసుబ్రమణ్యం. అలా ఆయన సంగీత ప్రస్థానం మొదలైంది.