ఆ పీతల రక్తం లీటర్‌ రూ.. 11 లక్షలు.. ఎందుకు వాడతారో తెలుసా..?

-

పీతల గురించి మీ అందిరికి తెలిసే ఉంటుంది. అవి ఇష్టపడి తినే వాళ్లు కూడా ఉంటారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉండే వాళ్లు అయితే పీతలు, చేపలను ఎక్కువగా తింటారు. అయితే మీరు హార్స్ షూ పీతల గురించి విన్నారా..? ఇవి పీతల కాదు..పైసలు.. ఈ పీతల రక్తం లీటరుకు 11 లక్షల రూపాయల విలువ చేసే వాటి రక్తం. పీతల రక్తానికి ఎందుకు ఇంత ధర..?
హార్స్ షూ పీతలు డైనోసర్ల కంటే కూడా పాత కాలం నాటివి. ఇవి భూమిపై దాదాపు 450 మిలియన్ల సంవత్సరాల నుంచి ఉంటున్నాయని సమాచారం… అయితే ఈ పీతలు ఇండియన్, అట్లాంటిక్, పస్ ఫిక్ సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో వసంత కాలం నుంచి మే, జూన్ వరకు అధిక ఆటుపోట్ల సమయంలో ఇవి కనిపిస్తాయి.. ఈ పీతలు ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. మనుషులకు ఇచ్చే టీకాలు, సూది మందులు, నరాల ద్వారా ఎక్కించే మందులు, శరీరంలోకి అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా, వాటిలో బ్యాక్టీరియా ఉందా అనేది ఈ పీతల రక్తం ద్వారా తెలుస్తుంది.
శాస్త్రవేత్తలు 1970ల నుంచి ఈ జీవి రక్తాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ పీతల రక్తం జీవ సంబంధమైన విషాలకు చాలా సున్నితంగా ఉంటుంది. బయోమెడికల్ ఉపయోగం కోసం ఏటా.. సుమారు 50 మిలియన్ల హార్ష్ షూ పీతలను ఉపయోగిస్తున్నారు. దీని ఒక లీటర్ ధర రూ.11 లక్షల వరకు ఉంటుంది. ఈ పీతల రక్తం నిజానికి నీలి రంగులో ఉంటుంది. వీటి రక్తంలో ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంది. ఇది బ్యాక్టీరియా చుట్టూ పేరుకుపోతుంది, వాటిని బంధిస్తుంది.
ఈ పీతలను సేకరించి ల్యాబ్‌కు తీసుకొస్తారు. వాటి బరువును కొలిచి రక్తం సరిపడా ఉన్నవాటిని మాత్రమే తీసుకుంటారు. ఆ పీతలను శుభ్రం చేసి.. వాటి గుండెకు సమీపంలోని రక్త నాళానికి సూదులు గుచ్చి రక్తం తీస్తారు. సగానికి పైగా రక్తాన్ని తీసిన తర్వాత వాటిని మళ్లీ సముద్రంలోనే వదిలిపెడతారు. అయితే ఇలా తీసిన పీతల్లో మూడో వంతు పీతలు మరణిస్తుంటాయి. ఈ ప్రక్రియలో 10 నుండి 30 శాతం పీతలు చనిపోతాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక ఆడపీతలు అయితే పునరుత్పత్తి సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు రకాల గుర్రపుడెక్క పీతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బయోమెడికల్ రంగంలో, చేపల మేతగా ఉపయోగించడం, అలాగే కాలుష్యం కారణంగా ఈ నాలుగు జాతులు కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మొత్తానికి ఈ పీతలను మన అవసరం కోసం వాడి వాటి ఉనికిని దెబ్బతీస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version