మనం ఒకోక్కసారి ఏమైనా పనులు చేస్తూ ఉంటే పెద్ద వాళ్ళు ఈ సమయంలో ఇది చేయకూడదు ఆ సమయంలో అది చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రూల్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టు కట్ చేసుకోకూడదు, గోళ్లు కట్ చేసుకోకూడదు ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నిజానికి వాటి వెనక పెద్ద అర్థమే ఉంటుంది.
అలానే ఎప్పుడైనా మీరు విన్నారా..? పెద్ద వాళ్ళు బట్టలు రాత్రిపూట ఉతకకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే రాత్రిపూట ఎందుకు బట్టలు ఉతకకూడదు..?, ఉతకడం వల్ల ఏమవుతుంది..? అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి వాళ్ళు చెప్పినట్లు అనుసరిస్తే మంచిది. ఇక బట్టలు ఎందుకు ఉతకకూడదు అనే విషయానికి వస్తే.. పాత కాలంలో రాత్రి చీకటిగా ఉండేది.
అప్పుడు లాంతరు పట్టుకుని వెళ్లాలి. రెండడుగుల దూరంలో లాంతరు పెట్టుకుని మనం బట్టలు ఉతకాలి. అప్పుడు ఏమీ కనపడదు. పైగా ఆ సమయంలో జంతువులు, పాములు, తేళ్లు వంటివి కూడా తిరుగుతూ ఉంటాయి.
వీటి వలన ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. అందుకనే రాత్రివేళల్లో బట్టలు ఉతకద్దు అని అంటూ ఉంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకద్దు అని పెద్దలు అంటారు అయితే అలా చెప్తే వినరు కనుక దరిద్రం పట్టుకుంటుందని లక్ష్మీదేవి ఉండదని అంటారు. ఇదే బట్టలు ఉతకకూడదు అని చెప్పడానికి వెనుక ఉండే కారణం.