అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం లో తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆ శుభదినం మే మూడవ తేదీన వచ్చింది. అక్షయ తృతీయ నాడు ఎలాంటి వస్తువులు కొన్నా అక్షయం అవుతుంది అని అందరు నమ్ముతారు. అందువల్ల డబ్బులు లేక పోయినా సరే అప్పు చేసి మరీ కొనుగోలు చేస్తారు.
బంగారం తో పాటు విలువైన వస్తువులను కూడా కొంటారు. నిజానికి అక్షయ తృతీయ నాడు హిందువులు విష్ణుమూర్తి ని పూజించాలి. అంతే కాకుండా ఆ రోజును శుభ దినంగా భావిస్తారు కాబట్టి కేవలం బంగారం మాత్రమే కాకుండా ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తే మంచి ఫలితమే ఉంటుంది.
అక్షయ తృతీయ నాడు ధాన్యం, జొన్నలు మొదలైన తృణధాన్యాలును కొని విష్ణుమూర్తికి సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని ఒక ఎర్రటి గుడ్డ లో పెట్టి ఉంచాలి. దీని వల్ల తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది. దాంతో పాటుగా ధాన్యం పెరుగుతుంది. లక్ష్మీ దేవికి గవ్వలు కూడా చాలా ఇష్టం. కాబట్టి అక్షయ తృతీయ నాడు గవ్వలు తీసుకొని లక్ష్మీ దేవి పాదాల వద్ద సమర్పించాలి.
ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు, తర్వాత రోజు ఆ గవ్వల ను ఎర్రటి గుడ్డ లో పెట్టి ఉంచవచ్చు. లక్ష్మీ దేవికి ఇష్టమైన వస్తువుల లో శంఖం కూడా ఒకటి. కాబట్టి ఈ అక్షయ తృతీయ కి శంఖాన్ని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటే సుఖ శాంతులను కూడా మీరు పొందుతారు. దీంతో పాటుగా శ్రీ యంత్రాన్ని కూడా పూజించ వచ్చు. కాబట్టి బంగారాన్ని మరియు విలువైన వస్తువుల్ని కొనడం తో పాటుగా ఇలాంటివి కూడా చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా మీరు పొందుతారు. అలానే మంచి ఫలితాలను కూడా మీరు పొందొచ్చు.