సిమ్ కార్డుకి ఒక పక్క ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా..?

మనం ఫోన్ లో వేసుకునే సిమ్ కార్డు ని ఒకసారి పరిశీలించి చూస్తే సిమ్ కార్డు ఒక వైపు మాత్రమే కట్ చేసి ఉంటుంది. అయితే ఎందుకు ఒక వైపు మాత్రమే కట్ చేసి ఉండాలి..? మిగతా మూడు వైపులా కూడా ఎందుకు కట్ చేసి ఉండదు..? ఈ విషయం గురించి ఇప్పుడు చూద్దాం. ఫోన్ లో వుండే సిమ్ కార్డు ని చూసినట్లయితే దానిలో గోల్డ్ కలర్ లో ఒక భాగం ఉంటుంది.

 

 

దానిని చిప్ అని అంటారు. ఆ చిప్ లో పిన్స్ అనేవి చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఉంటుంది. అందులో ఉండే పిన్స్ ని ఫోన్లో ఉండే సిమ్ స్లాట్ లోని పిన్స్ కి ఫిక్స్ చెయ్యాలి. సిమ్ లోని అన్ని పిన్స్ కూడా సరిగ్గా తాకాలి. అలా తాకాలి అంటే ఫోన్ లో ఉండే స్లాట్ లో సిమ్ కార్డును సరైన పొజిషన్ లో ఫిక్స్ చేయాలి. అందుకే ఒక భాగం కట్ చేసి ఉంటుంది.

లేదు అంటే సిమ్ అమర్చలేము. అలా కట్ చేయలేదు అంటే ఇది ఫిక్స్ అవ్వదు. పైగా మరొక బెనిఫిట్ ఏమిటంటే ఇలా కట్ చేసి ఉండటం వల్ల చదువుకొని వాళ్ళు కూడా సిమ్ ని ఈజీగా ఫిక్స్ చేయొచ్చు ఒకవేళ కనుక అన్నీ కట్ చేసి ఉన్న ఏది కట్ చేయకుండా ఉన్న కూడా అర్థం కాదు.

దీనితో సిమ్ కార్డ్ ని ఫిక్స్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలా అయితే మనం ఏటీఎం కార్డు పెట్టినప్పుడు ఇబ్బంది పడతామొ అలా. అందుకే సిమ్ కార్డు కి ఒక వైపు కట్ చేసి ఉంటుంది అది నేనో అయినా మైక్రో అయినా.