పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో తెలుసా..?

-

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి తో కొత్త జీవితం మొదలవుతుంది. అయితే ఎవరి సాంప్రదాయం ప్రకారం పెళ్లి ని జరుపుతారు. అయితే పెళ్లి లో చాలా ఘట్టాలు ఉంటాయి. తాళి కట్టడం, అరుంధతి ఇలా చాలా ఉంటాయి. అయితే వాటిలో తలంబ్రాలు కూడా చాలా ముఖ్యమైనది.

 

అయితే తలంబ్రాలు ఎందుకు పోసుకోవాలి..?, దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనే దాని గురించి చూద్దాం. తలంబ్రాలు పోసేటప్పుడు వేద పండితులు చదివే మంత్రం లో విశేషమైన అర్థాలు కూడా ఉంటాయని.. ఆ మంత్రాలు సంసార బాధ్యతలను గుర్తు చేస్తాయి అని పండితులు అంటున్నారు.

కొబ్బరి కుడకలు లో బియ్యం పోసి నేతిలో ప్రోక్షించి వధూవరులిద్దరికీ అందించి కపిలగోవులను స్మరిస్తూ పుణ్య దానం చేయాలని.. వృద్ధి శాంతి, తుష్టి పుష్టి కలగాలని అన్ని విఘ్నాలు తొలగిపోయి ఆయుష్షు పెరిగి ఆరోగ్యం బాగుండాలని అన్ని విధాల అభివృద్ధి చెందాలని పిల్లా పాపల తో నిండు నూరేళ్లు సుఖంగా జీవితంతో ఉండాలని మంత్రాలు చదువుతారు. ఈ విధంగా వధూవరులిద్దరూ తలంబ్రాలు పోసుకుంటారు. తలంబ్రాలు అంటే తలపై బియ్యం పోసేది అని అర్థం. ఇలా పెళ్లి లో జరిగే ఈ ఘట్టం లో వధూవరులిద్దరూ ఎంతో ఆనందంగా పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version