పెళ్లయ్యాక మహిళలు బరువు ఎందుకు పెరిగిపోతారో తెలుసా..?

-

పెళ్ళికి ముందు సన్నగా ఉండే మహిళలు కూడా పెళ్లి తర్వాత లావై పోతూ ఉంటారు. బాగా బరువు పెరిగి పోతూ ఉంటారు. అయితే ఎందుకు మహిళలు పెళ్లి తర్వాత లావైపోతారు..?, బరువు పెరిగిపోతారు అనే సందేహం మీలో ఎప్పుడైనా కలిగిందా..? అయితే దానికి గల కారణాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాటి కోసం ఒక లుక్ వేయండి.

చాలా మంది స్త్రీలు పెళ్లికి ముందు చాలా సన్నగా తక్కువ బరువుతో ఉంటారు. కానీ పెళ్లి తర్వాత బాగా బరువై పోతారు. సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే పెళ్లి తర్వాత దాదాపు రెండు కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు పెరిగిపోయే అవకాశం ఉందట. దీనికి గల కారణం ఏమిటంటే… స్త్రీలకి పెళ్ళికి ముందు చదువు, ఉద్యోగం తల్లిదండ్రులు ఇలా చాలా టెన్షన్స్ ఉంటాయి. ఈ కారణంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు. అందుకని సన్నగా ఉంటారు.

కానీ పెళ్లి తర్వాత ఫ్రీగా ఉంటారు. అలాగే అంత టెన్షన్ కూడా ఉండవు. సెటిల్ అయిపోతారు. కాబట్టి ఫ్రీగా ఉంటారు. దీనితో ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. కాస్త బరువు పెరుగుతారు. అందుకని అలాగే పెళ్లికి ముందు ఎక్కువగా పనులు చేసుకుంటూ ఉంటారు కానీ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ వస్తుంది.

ఈ గ్యాప్ లో బరువు పెరిగిపోతారు. అలాగే ఒకవేళ ఆహారం ఎక్కువగా వండితే మిగిలిపోతుంది ఏమో అని కాస్త ఎక్కువగా తింటుంటారు. పైగా యోగా వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఈ కారణాల వల్లే మహిళలు పెళ్లి తర్వాత బరువు పెరిగిపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news