పొత్తి కడుపులో తరచూ నొప్పి వస్తుందా..? ఈ క్యాన్సర్ లక్షణం కావొచ్చు..

-

మహిళలకు ప్రధానంగా.. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని అందరికీ తెలుసు..దీంతో పాటు.. అండాశయ క్యాన్సర్ కూడా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో అతిముఖ్యమైనది. ఏటా కొన్ని లక్షల మంది క్యాన్సర్ భారిన పడుతున్నారు. వ్యాధి లక్షణాలను ముందే గ్రహించలేకపోవడం వల్లే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. అండాశయ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. దీనిపై ప్రతి మహిళకు అవగాహన ఉండాలి.

అండాశయ క్యాన్సర్ అంటే ఏంటి..?

గర్భాశయంలో వచ్చే క్యాన్సర్‌ను అండాశయ క్యాన్సర్ అంటారు. దీనినే గర్భాశయ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. పొత్తి కడుపులో నొప్పి, వాపు, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.. ఈ క్యాన్సర్ కారణంగా గర్భధారణ పరిస్థితులలో ఇబ్బంది ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి 35 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని… 50 ఏళ్ల తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్నాయని చెప్తుంది..

ఈ క్యాన్సర్ గర్భాశయం లోపల ఉన్న అండాశయాలలో ప్రారంభమవుతుంది. క్యాన్సర్ కణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లో వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా పొట్టలో గ్యాస్‌ సమస్య ఏర్పడుతుంది. అండాశయ క్యాన్సర్ కేసులు చాలా వరకు ముదిరిన దశలోనే వెలుగుచూడటం జరుగుతుంది. అండాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఉత్తమ మార్గం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడమే. ఇది కాకుండా ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండటం ముఖ్యం.

అండాశయ క్యాన్సర్ కు కారణాలు..

ఈ క్యాన్సర్ కు సరిగ్గా ఇదే కారణం అని వైద్యులు నిర్థారించటం లేదు.. ఇవి కూడా కారణాలుగా చెప్తున్నారు..

అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం ప్రమాదాన్ని పెంచుతుంది.

ఒక మహిళ తన జీవితకాలంలో ఎక్కువ సార్లు అండాలను విడుదల చేయడం వల్ల ఈ అండాశయ కేన్సర్ ప్రమాదం ఉంటుందట.

గర్భం దాల్చినపుడు ( 9 నెలల పాటు) మరియు పాలిచ్చే స్త్రీలలో అండం విడుదల జరగదు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే, ఆమెకు అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ.

గర్భనిరోధక మాత్ర తీసుకోవడం, గర్భవతిగా ఉండటం లేదా తల్లి పాలివ్వడం ద్వారా ఈ సంఖ్యను తగ్గించగలం.

పిల్లలు లేని స్త్రీలలో, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చిన మహిళల్లో కేన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

కుటుంబంలో ఎవరికైనా ఒవేరియన్ కేన్సర్ వచ్చినట్లయితే, మిగిలిన సభ్యులకు చ్చే అవకాశం ఉంటుందట.

  •  BRCA1 మరియు BRCA2 జన్యువులు కలిగిన స్త్రీలలో అండాశయం (Ovary) మరియు రొమ్ము కేన్సర్ ప్రమాదం ఉంది.
  • LYNCH II సిండ్రోమ్ ఉన్న కుటుంబాలు కూడా అండాశయ కేన్సర్ ప్రమాదం ఉంది.

రొమ్ము కేన్సర్ ఉన్న మహిళలకు అండాశయ కేన్సర్ ప్రమాదం ఎక్కువే.

అండాశయ కేన్సర్ రిస్క్‌ని తగ్గించుకోవడం ఎలా?

ఎవరైనా స్త్రీ, 26 సంవత్సరాలకు మునుపే గర్భం దాల్చి, అది తొమ్మిది నెలలు నిండేవరకూ కొనసాగితే ఆమెకు అండాశయ కేన్సర్ రిస్క్ తగ్గుతుంది.

బిడ్డలకు తల్లిపాలనివ్వడం ద్వారా కూడా ఈ రిస్క్ తగ్గుతుంది.

గర్భ నిరోధక మాత్రల వాడడం (3 – 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) వల్ల ఈ రిస్క్ తగ్గుతుంది.

ఫామిలీ ప్లానింగ్ (ట్యూబెక్టమీ) ఆపరేషన్, గర్భ కోశాన్ని తొలగించే హిస్టిరెక్టమీ ఆపరేషన్, తర్వాత కూడా ఈ రిస్క్ తగ్గుతుంది.

హార్మోన్ రీప్లేస్ మెంట్ వాడని స్త్రీలలోను, పొగ త్రాగని వారికీ, సరైన బరువు మెయింటైన్ చేసే స్త్రీలలో ఈ రిస్క్ తక్కువగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news