చాలా మంది పొడి దగ్గుతో బాధ పడుతుంటారు. చలికాలం అందులోనూ ఒమీక్రాన్ వేరియంట్ వలన చాలా మందిలో పొడి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే పొడి దగ్గు వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే నీరసం కూడా వస్తుంది. అయితే అసలు పొడి దగ్గు ఎలా వస్తుంది..? పొడి దగ్గు ని ఎలా తగ్గించుకోవాలి అని దాని గురించి ఇప్పుడు చూద్దాం.
పొడి దగ్గు రావడానికి కారణాలు:
స్మోకింగ్ వల్ల పొడి దగ్గు వస్తుంది. హానికరమైన పదార్థాలని డైరెక్ట్ గా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలిగి పొడి దగ్గు వస్తుంది.
అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పొడి దగ్గు వస్తుంది.
ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళకి పొడి దగ్గు ఉంటుంది.
పొడి దగ్గు సమస్య నుండి ఎలా బయటపడాలి..?
తులసి టీ చేసుకుని తీసుకుంటే పొడి దగ్గు నుంచి త్వరగా బయటపడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టీ ని ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.
తులసి ఆకులు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు వేసి ఐదు నుంచి ఏడు తులసి ఆకులు వేయండి. పది నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టేసుకుని చల్లారాక తీసుకుంటే పొడి దగ్గు సమస్య నుండి బయటపడవచ్చు. దీనిలో మీరు కావాలనుకుంటే యాలకులు, అల్లం, మిరియాలు, తేనె వంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా పొడి దగ్గు సమస్య నుండి బయట పడవచ్చు.