Breaking : త‌ణుకు ఎమ్మెల్యే నాగేశ్వ‌ర‌రావుకు రోడ్డు ప్ర‌మాదం

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని త‌ణుకు నియోజ‌క వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర్ రావుకు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి త్రిపురాంత‌కం వెళుతున్న మార్గ మ‌ధ్యలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కాగ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర రావుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఎమ్మెల్యే అనుచ‌రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగ త‌ణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర్ రావు ఇటీవ‌ల హైద‌రాబాద్ వెళ్లారు.

అక్కడ నుంచి ఆయ‌న త్రిపురాంత‌కం వెళ్ల‌డానికి ఈ రోజు సాయంత్రం బ‌య‌లు దేరారు. మార్గ మ‌ధ్యలో ఉండ‌గా మాచర్ల మండలం ఎత్తిపోతల సమీపంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర్ రావు ప్ర‌యాణిస్తున్న కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. ఎమ్మెల్యే ప్ర‌యాణిస్తున్న కారును మ‌రో కారు ఓవ‌ర్ టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు స్వ‌ల్పంగా డ్యామేజ్ అయింది. అయితే కారులో ఉన్న ఎమ్మెల్యే నాగేశ్వ‌ర్ రావుకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్ర‌మాదం అనంత‌రం ఎమ్మెల్యే నాగేశ్వ‌ర్ మ‌రొక కారులో త్రిపురాంత‌కం వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news