తెలంగాణలోని షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి.. ఉదయం సజీవ దహనమై ఉండటం సంచలనం రేపింది. మృతురాలిని ప్రియాంక రెడ్డిగా గుర్తించారు. ట్రీట్ మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని తన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ పాడైందని, చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు భయమేస్తోందని ఆమె తన చెల్లికి ఫోన్‌లో వివరించింది. అయితే ఈ రోజు ఉదయం షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంక మృతదేహం లభ్యమవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
అయితే ప్రియాంక రెడ్డిని ఎవరు హత్య చేశారనే అంశంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గరికి వెళ్లిన ప్రియాంక అక్కడ స్కూటీ పెట్టి క్యాబ్ లో గచ్చిబౌలికి వెళ్లింది. రా.9.15 గంటలకు తిరిగి శంషాబాద్ టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. అయితే ఆమె వచ్చేసరికి స్కూటీకి పంక్చర్ చేశారా..?, ఇంతకీ స్కూటీకి పంక్చర్ చేసిన ఆ వ్యక్తి ఎవరు..?, మరి సాయం చేస్తానని వచ్చిన ఆ వ్యక్తి ఎవరు..?, పంక్చర్ చేయించిన తర్వాత ప్రియాంక ఎవరి వాహనంపై వెళ్లింది..?, ఆ స్పాట్ లో స్కూటీ ఎందుకు లేదు..?, ప్రియాంకను చంపింది లారీ డ్రైవర్లా లేదా తెలిసిన వ్యక్తులా…? అన్న ప్రశ్నలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.