అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరిన ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్‌యాద‌వ్

-

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, కానీ నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు ఆసుప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు.

లాలూ ప్ర‌సాద్ బ్ల‌డ్ షుగ‌ర్‌, బీపీ హెచ్చు త‌గ్గుల‌కు లోన‌వుతున్నాయ‌ని షుగ‌ర్ లేవ‌ల్స్ కూడా ఉద‌యం కంటే మ‌ధ్యాహ్నానికి పెరిగాయ‌ని డాక్ట‌ర్ విద్యావ‌తి తెలిపారు. లాలూ కోసం రిమ్స్ ఏర్పాటు చేసిన ఏడుగురు స‌భ్యుల వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. లాలూ కొంత కాలంగా కిడ్ని స‌మ‌స్య‌తో పాటు ప‌లు వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉండ‌గా దాణా కుంభ‌కోణానికి సంబంధించి ఐదో కేసులో లాలుప్ర‌సాద్‌కు సోమ‌వారం శిక్ష ఖ‌రారు అయింది. సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఆయ‌న‌కు శిక్ష విధించింది. ఐదేండ్ల శిక్ష‌తో పాటు రూ.60ల‌క్ష‌ల జ‌రిమానా విధించాల‌ని తీర్పునిచ్చింది. 1990 త‌రువాత లాలూ సీఎంగా ఉన్న‌ప్పుడు డోరండా ట్రెజ‌రీ నుంచి రూ.139.5 కోట్లు అక్ర‌మంగా తీసుకున్నారని ఆయ‌న‌పై కేసు న‌మోదు అయింది. బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అనారోగ్యం కార‌ణంగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ కోర్టు విచార‌ణ‌లో పాల్గొన్నారు. ఇందులో 950 కోట్ల వ‌ర‌కు స్కామ్ జ‌రిగింద‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

Read more RELATED
Recommended to you

Latest news