పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గనిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా దాదాపు 56 మంది మృత్యువాతపడ్డారు. మరొక 100 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించడానికి కారణం రసాయనాలు నిలువ చేయడం ద్వారానే జరగవచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. తొలి పేలుడు రాత్రి 2 గంటల సమయంలో జరిగిందని ఓ అధికారి వెల్లడించారు. పేలుడు సంభవించడంతో అక్కడి కార్మికులు భయబ్రాంతులకు గురై కొందరూ పరుగెత్తగా.. మరికొందరూ ప్రాణాలు కోల్పోయారు.