గుడ్ న్యూస్; కరోనా వైరస్‌కు అంత సీన్ లేదు…!

-

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కరోనా వైరస్ మాటే వినపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రజలను తీవ్రంగా భయపెడుతుంది. ఇప్పటికే దీని కారణంగా 200 మందికి పైగా చైనా సహా పలు దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీనితో దాదాపు అన్ని దేశాల్లో కూడా కరోనా కారణంగా అప్రమత్తత ప్రకటించారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎప్పటికప్పుడు స్క్రేనింగ్ టెస్టులు చేస్తున్నారు.

భారత్, అమెరికా, రష్యా, జర్మని, జపాన్ దేశాలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా సరిహద్దున చైనా ఉన్న నేపధ్యంలో మన దేశంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. దానికి అంత సీన్ లేదని తేల్చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అందరూ భయపడుతున్నట్టు అంత ప్రమాదకరమేమీ కాదని అంటున్నారు.

దీనిపై మాట్లాడిన పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి… వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నా వ్యాధి తీవ్రత తక్కువేనని, గతంలో ప్రబలిన సార్స్‌ కంటే కరోనా వైరస్‌ తీవ్రత చాల తక్కువని మీడియాకు తెలిపారు. 2003లో ప్రబలిన సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌) బారిన పడ్డ రోగుల్లో 10 శాతం మరణాలు నమోదయ్యాయని… ప్రస్తుత కరోనా వైర్‌సకు గురైన వారిలో 2శాతం మాత్రమే మరణాలు నమోదు అయ్యాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news