వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే దమ్ముందా? సచివాలయ వ్యవస్థను రద్దు చేసే దమ్ముందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ రూపాయి ఇస్తానంటే బాబు నాలుగు రూపాయలు ఇస్తానంటారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని అన్నారు. పేదవాడి భవిష్యత్ మారాలంటే మళ్లీ వైసీపీనే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో పౌర సేవలన్నీ ఇంటికే వస్తున్నాయని జగన్ అన్నారు. ‘ పెన్షన్లు, రేషన్, వైద్య సేవలు ఇంటికే అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరో 15 సంవత్సరాలు ఇలాంటి పాలన ఉంటే ప్రజల జీవితాలు ఇంకెంత బాగుపడతాయో ఆలోచించండి అని అన్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు లాంటి మోసకారిని నమ్మొచ్చా? సైకిల్ను ఇంటి బయటే ఉంచాలి.. గ్లాసుని సింక్లో పడెయ్యాలి. వైసీపీకి ఒక్క సీటు తగ్గకుండా గెలిపించాలి’ అని ముఖ్యమంత్రి జగన్ కోరారు.