కరోనా కారణంగా చాలామందిలో చాలా సందేహాలు ఉన్నాయి. వాటికి సంతృప్తికరమైన సమాధానాల కోసం చూస్తూనే ఉన్నారు. అందులో ఒకటైన సందేహం.. ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ గురించి. క్వారంటైన్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ 14రోజుల తర్వాత నెగెటివ్ కోసం టెస్ట్ చేయించుకోవాల్సిందేనా అని వారి సందేహం. ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉండడం వల్ల ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఆలస్యం అవుతుంది. కొన్ని కొన్ని చోట్ల ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అన్ని రోజులు కరోనా పాజిటివా, నెగెటివా అన్న సంధిగ్ధంలో పడిపోయి మరింత భయాందోళనలకి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో అసలు లక్షణాలు లేని లేదా చాలా తక్కువ లక్షణాలు కలిగి ఉన్న వారు 14రోజుల తర్వాత ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకొవాల్సిందేనా అనే విషయమై నిపుణులు చెబుతున్న సమాధానాలు.
అసలు లక్షణాలే లేని వారు
ఇలాంటి వారుపది రోజుల్లో క్వారంటైన్ పూర్తి చేసుకోవచ్చు. అది కూడా వరుసగా మూడురోజులు జ్వరం రాకుండా ఉండాలి. ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నట్లయితే 10రోజుల్లో టెస్ట్ అవసరం లేకుండానే బయటకి రావచ్చు. పాజిటివ్ వచ్చాక ఐసోలేషన్ లోకి వెళ్ళాలి. మొదటి ఏడు రోజుల పాటు తనని బాగా గమనించుకోవాలి.
లక్షణాలు చాలా తక్కువగా ఉంటే
మొదటి మూడు రోజుల తర్వాత లక్షనాలు తగ్గిపోయి ఆ తర్వాత పది రోజుల్లో ఎలాంటి లక్షణాలు వృద్ధి కాకపోతే 14రోజుల వరకు క్వారంటైన్ లో ఉండాలి. అలాగే క్వారంటైన్ అనంతరం ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. పాజిటివ్ వచ్చాక ఐసోలేషన్లోకి వెళ్లాలి.
తీవ్రంగా ఉన్నవారు
కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారు
ఖచ్చితంగా నెగెటివ్ రిపోర్ట్ అందుకున్న తర్వాతే క్వారంటైన్ నుండి బయటపడాలి.
నిపుణుల ప్రకారం లక్షణాలు లేని, చాలా తక్కువ లక్షణాలు ఉన్న వారిలో వైరస్ ఏడు రోజుల్లో చనిపోతుంది. అలాంటి వారి నుండి ఇతరులకి వైరస్ వ్యాపించదు. కాకపోతే భౌతికదూరం , చేతుల పరిశుభ్రత, మాస్క్ పెట్టుకోవడం ఖచ్చితంగా పాటించాల్సిందే.