గర్భిణీ స్త్రీని చంపేసిన పెంపుడు కుక్కలు…!

-

ఫ్రాన్స్ లో గర్భిణీ స్త్రీని పెంపుడు కుక్కలే కరిచి చంపాయి… ఉత్తర ఫ్రాన్స్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని సైతం కలవరపెడుతుంది. వివరాల్లోకి వెళితే ప్యారిస్‌కు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల (55 మైళ్ళు) దూరంలో ఉన్న విల్లర్స్-కాటెర్రాట్స్ పట్టణానికి వెలుపల ఉన్న అడవిలో 29 ఏళ్ల మహిళ మృతదేహం కొందరు కనుగొన్నారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆమె కుక్కలా దాడిలో మరణించింది అని ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు… వెంటనే విచారణ మొదలుపెట్టగా…

భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది… ఆమె తన హౌండ్ జాతి కుక్కలతో అడవిలో నడుస్తూ ఉండగా అవి ఆమె మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి… ఆ కుక్కల ప్రవర్తన ముందే పసిగట్టిన ఆమె తన భర్తకు సమాచారం ఇవ్వగా అతను అక్కడికి వచ్చే లోపే ఆ కుక్కలు… ఆమె శరీరంలో తల, నడుం భాగాల్లో కరిచాయని… ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మరణించిందని వైద్యుల నివేదికలో వెల్లడించారు. అసలు ఈ దాడి చేసింది ఎన్ని కుక్కలు అనే దాని మీద అధికారులు విచారణ మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా 93 కుక్కలకు రక్త పరీక్షలు నిర్వహించారు అధికారులు. వీటిల్లో 5 కుక్కలు ఆమె మీద దాడి చేసి చంపినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో కొంత కాలంగా హౌన్డ్ జాతి కుక్కలు జింకలను వేటాడుతున్నాయని, ఆమె ఆ కుక్కలను అదుపు చేయడంతోనే దాడికి పాల్పడ్డాయని తేలింది. ఇది జింకలను వేటాడే సీజన్ అని స్థానిక పత్రికలూ పేర్కొన్నాయి. దీనిపై జంతు సంరక్షణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే వాటి వేటను నిలిపి వెయ్యాలని, ఈ మేరకు ఆదేశాలు జరీ చెయ్యాలని వారు కోరుతున్నారు. ఫ్రెంచ్ వేట సంఘం ఒక ప్రకటనలో “ఈ మహిళ మరణంలో వేట హౌండ్ల ప్రమేయం” ఉన్నట్లు ఆధారాలు లేవని ప్రకటించడం గమనార్హం…

Read more RELATED
Recommended to you

Latest news