అదేంటి 60 ఏళ్ల పాటు ఎవరైనా ఫ్రీగా పిజ్జా ఇస్తారా అని ఆశ్చర్యపోకండి. అలాంటి బంపర్ ఆఫర్ అప్పుడే పుట్టిన బాబుకు దక్కింది. డొమినోస్ పిజ్జా అంటే తెలియని వారుండరు. సిటీలో ఉండే వారు దాదాపుగా ఒక్కసారైనా డొమినోస్ పిజ్జా తిని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆస్ట్రేలియాలో ఈ సంస్థ ఏర్పాటు అయి డిసెంబర్ 9 కి అరవై ఏళ్లు పూర్తయ్యాయి.
దీంతో మొన్న డిసెంబర్ 9న పుట్టిన పిల్లలకు డొమినికన్ పేరు పెడితే వారికి 60 ఏళ్ల పాటు ఉచితంగా పిజ్జా అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ పోటీలో సిడ్నీ నగరానికి చెందిన క్లెమెంట్ – ఆంటోనీ అనే దంపతులకు డిసెంబర్ 9న తెల్లవారుజామున 01:47 ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి డొమినికన్ పేరు పెట్టారు. దీంతో 60 ఏళ్ల పాటు ఉచితంగా పిజ్జా ఆఫర్ పట్టడమే కాక 10,800 డాలర్ల ప్రైజ్ మనీ కూడా ఈ ఫ్యామిలీకి దక్కింది.