సర్కార్ కీలక నిర్ణయం.. రేపటి నుండి నైట్ కర్ఫ్యూ

-

బ్రిటన్ ‌లో కరోనా వేరియంట్ స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో.. మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. రేపటి నుంచి జనవరి 5 వరకూ రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకూ కర్ఫ్యూ సమయమని తెలిపింది. నేరుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున.. మరోసారి ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది . ప్రధానంగా మున్సిపాలిటీల పరిధిలో ఈ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తెలిపింది.

ఇక కొత్త రకం కరోనా విజృభిస్తుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గతవారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్లను ట్రాక్‌ చేయాలని నిర్ణయించింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో కరోనా సర్వెలెన్స్ నిర్వహించనున్నారు. అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా జరపనున్నారు. ఇక ఈ టెస్టుల్లో పాజిటీవ్ వచ్చిన వారిని నేరుగా ఆసుపత్రులకు తరలిస్తారు. నెగిటివ్ వచ్చినప్పటికీ వారం రోజుల పాటు ఇన్స్తిటూషనల్  క్వారంటైన్ తప్పని సరి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news