మాంసంలాగే టేస్ట్ ఉండాలి, కానీ వెజ్ ఆహారం అయి ఉండాలి.. అని కోరుకునే శాకాహార ప్రియులకు శుభవార్త. ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ సరిగ్గా అలాంటి పిజ్జానే ఆవిష్కరించింది. దానికి ది అన్‌థింకబుల్ పిజ్జా అని పేరు పెట్టింది. ఈ పిజ్జా నిజానికి చికెన్ లాంటి టేస్ట్‌ను కలిగి ఉంటుంది. కానీ దాన్ని మాత్రం పూర్తిగా వెజ్ పదార్థాలతో తయారు చేశారు.
పూర్తిగా వృక్ష సంబంధ ప్రోటీన్లతో డామినోస్ పిజ్జా వారు సదరు పిజ్జాను రూపొందించారు. దీంతో దేశంలోనే తొలి వృక్ష సంబంధ మాంసం పిజ్జాగా ఆ పిజ్జా గుర్తింపు పొందింది. అందులో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. కానీ చికెన్ తిన్నట్లు అనిపిస్తుంది. అందులో పూర్తిగా 100 శాతం వెజ్ పదార్థాలనే వాడడం విశేషం.
అయితే ఈ పిజ్జా దేశంలోని అన్ని డామినోస్ స్టోర్‌లలో లభించడం లేదు. కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరులలోనే ఈ కొత్త రకం పిజ్జాను ఆస్వాదించవచ్చు. కాగా డామినోస్ పిజ్జాకు దేశ వ్యాప్తంగా 281 చోట్ల మొత్తం 1264 రెస్టారెంట్లు ఉండగా.. వాటిని జూబిలంట్ ఫుడ్ వర్క్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఆ సంస్థ సీఈవో ప్రతీక్ పోటా మాట్లాడుతూ.. వెజ్ ఆహారాన్ని చికెన్ టేస్ట్‌తో తినాలని అనుకునే వారు ఈ పిజ్జాను ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు.