ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే… సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలే.
ఈ రూల్స్ వద్దని తక్షణమే నిలిపివేయాలని వాట్సాప్ అంటోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా యూజర్ల వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించేలా కొత్త రూల్స్ ఉన్నాయని అంది.
అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన పోస్ట్స్ ఏమైనా పెడితే వాటి మూలాలను సోషల్‌మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది.
ఇలా కనుక రూల్స్ ఉంటే అది వ్యక్తుల గోప్యత హక్కులను ఉల్లంఘించినట్లేనని వాట్సాప్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు ఉంటాయని, ఒకవేళ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తే ఆ ఎన్‌క్రిప్షన్‌ను పక్కన పెట్టేయాల్సి వుంది అని కూడా వుంది.
కనుక వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. ఇది ఇలా ఉండగా. దీని పై కోర్టు ఎప్పుడు విచారణ జరపనుందన్న వివరాలు మాత్రం ఇక తెలియదు. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సంస్థలకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3 నెలల గడువు కల్పించింది. అది మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసినదే.