గవర్నమెంట్ బద్నామ్ కావొద్దు అంటే లిస్ట్ బయటపెట్టకండి.. అధికారులకు సూచిస్తున్న నాయకులు..!

-

తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న నూతనంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది ఎంపికైనట్టు గ్రామసభల్లో అధికారులు విడుదలైన లిస్ట్ ను చదువుతున్నారు. దీంతో లిస్ట్ లో పేర్లు రానివారు వాగ్వాదానికి దిగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గవర్నమెంట్ బద్నామ్ కావొద్దు అంటే లిస్ట్ బయటపెట్టకండి.. అధికారులకు ఓ కాంగ్రెస్ నాయకుడు సూచించాడు.  లిస్ట్ బయటకు చెబితే.. భూమి లేని మాకు ఎందుకు రాలేదు.  వాళ్ళకి ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు.  సూర్యాపేట, బొల్లంపల్లి గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా నిజమైన అర్హుల పేరు లేవని అధికారులను నిలదీయడంతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం కల్పించుకుని ఎంపిక చేసిన పేర్లు చెప్పకండి అని అధికారులకు చెప్పాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని ప్రజల ముందు అధికారులకు సూచించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news