ఈ రోజుల్లో ఆన్లైన్ మార్కెట్ క్రమంగా పెరిగిన నేపధ్యంలో జనం ఏది కొన్నా సరే దాంట్లోనే కొనుగోలు చేస్తున్నారు. దీనితో ఆన్లైన్ మార్కెట్ కి క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. తినే వస్తువుల దగ్గరి నుంచి తోలే బండి వరకు అన్నీ కూడా ఆన్లైన్ లోనే కొనుగోలు చేయడంతో అనేక రకాల ఆఫర్లు కూడా ఇప్పుడు వారి కోసం అందుబాటులో ఉంటున్నాయి. వేలాది వెబ్ సైట్స్ ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నాయి.
తినే వస్తువుల సంగతి ఏమో గాని కొనే బట్టల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఆన్లైన్ లో బట్టల సైజ్ అనేది చెప్పడం కష్టం, మనిషికి ఒకరకంగా సైజ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆన్లైన్ లో కొనే బట్టల సైజ్ అనేది ఊహించుకుని సరిపోతుంది అని కొంటె అది వృధా అవ్వడమే గాని ఉపయోగం ఉండదు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి వాటిల్లో ఏమీ కాదు గాని,
ఇప్పుడు ఫేస్బుక్ లో అనేక రకాల వెబ్ సైట్స్ దర్శనం ఇస్తున్నాయి. వాటిల్లో బట్టలు కొంటె మాత్రం ఇబ్బంది పడటమే. వాళ్ళు తిరిగి తీసుకునే అవకాశం కూడా తక్కువ. కాబట్టి ఆన్లైన్ లో అసలు బట్టలను కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే చెప్పులు కూడా, కంపెనీ బట్టి సైజ్ ఉంటుంది. ఒక కంపెనీలో 7 నెంబర్ సరిపోతే మరో కంపెనీలో 8 సరిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అని యాప్స్ ఆధారంగా ఆన్లైన్ లో బట్టలు కొనవద్దని హెచ్చరిస్తున్నారు.