ఈ రోజుల్లో టాటూ అనేది చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. గతంలో వందలో ఇద్దరు ముగ్గురికి ఉంటే ఇప్పుడు వందలో 30, 40 మందికి ఉంటుంది. దీని వలన ఏదో లాభం ఉంటుంది అని వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే టాటూ వేయించుకున్న తర్వాత చాలా మంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. దీని కారణంగా టాటూ విలువ పోయే ప్రమాదం ఉంటుంది.
టాటూ వేయించుకున్న 1 – 3 గంటల్లో బ్యాండేజీ తొలగించాలని సూచిస్తున్నారు.
తర్వాత యాంటీ సెప్టిక్ ఆయింట్‌మెంట్ రోజుకు కనీసం మూడుసార్లు అప్లై చేసుకోవాలి.
స్నానం చేసే సమయంలో టాటూ ఆసలు తడవనివ్వకూడదట. టాటూకు ఎక్కువసేపు ఎండ తగలనివ్వకూడదని చెప్తున్నారు.
నాలుగో రోజు మాయిశ్చరైజర్ వాడడం మొదలు పెట్టాలని చెప్తున్నారు.
మూడు వారాల పాటు రోజులో ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి.
టాటూ పాడవకుండా సన్‌స్ర్కీన్ వాడితే మంచిది.
టటూ మానిపోయే సమయంలో గోకడం, గిల్లడం అసలు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు.