ఎవరైనా కొత్తగా జిమ్ కి వెళ్ళినా వాకింగ్ కి వెళ్ళినా సరే వారికి తర్వాతి రోజు ఒంటి నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వర్కౌట్ అలవాటు అవుతున్న కొద్దీ ఆ నొప్పులు అనేవి ఎక్కడా ఉండవు. అయితే కొంత మందిని మాత్రం ఆ నొప్పులు ప్రతి రోజు వేధిస్తూనే ఉంటాయి. అలా ఊరికినే రావు అంట, దానికి ఒక కారణం కూడా ఉంటుందని అంటున్నారు నిపుణులు.
డైట్ సరిగా లేకపోతే అలా నొప్పులు రోజు వస్తాయని అంటున్నారు. ఏ విధమైన వ్యాయామం చేసినా సరే కండరాలు కాస్త అలసిపోవడం సహజం. బరువులతో వ్యాయామాలు అంటే శక్తి ఎక్కువగా వినియోగం అవుతూ ఉంటుంది. దీనితో తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. వ్యామమం చేసిన తర్వాత మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొంతమంది మరీ ఆలస్యంగా రాత్రి వేళ జిమ్‌కు వెళ్లి,
వచ్చేసి ఏమీ తినకుండానే నిద్రపోతూ ఉంటారు. దీనితో ఉదయం భరించలేని ఒంటి నొప్పులతో లేస్తూ ఉంటారు. వ్యాయామం చేసినప్పుడు కండరాల శక్తి అనేది కరుగుతుంది కాబట్టి వాటికి శక్తి కావాలి అంటే ఏదైనా తినాలి. సాయంత్రం ఎంత ఆలస్యంగా వర్కవుట్స్ చేసినా, గుడ్లు, ఇతరత్రా మాంసకృత్తులతో కూడిన ఆహారం తప్పకుండా తినాలి. ఇలా చేస్తే తిరిగి వర్కవుట్ చేయడానికి సరిపడా శక్తి కూడా సమకూరుతుంది.